Big Stories

Mallikarjun Kharge :2024లో కాంగ్రెస్ కూటమిదే అధికారం..ఖర్గే జోస్యం

Mallikarjun Kharge : 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటిమే విజయం సాధిస్తుందని ఏఐసీసీ అధ్యక్షడు మల్లికార్జున ఖర్గే జోస్యం చెప్పారు. బీజేపీ వ్యతిరేక కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఖర్గే భవిష్యత్ రాజకీయాలపై కీలక విషయాలు వెల్లడించారు. నాగాలాండ్‌ ప్రజలను బీజేపీ మోసం చేసిందన్నారు.

- Advertisement -

20 ఏళ్లుగా నేషనల్‌ డెమొక్రాటిక్‌ ప్రోగ్రెస్సివ్‌ పార్టీ , బీజేపీ నాగాలాండ్‌ను లూటీ చేస్తున్నాయని ఆరోపించారు. నాగాలాండ్ ప్రజల సంప్రదాయాలను కాషాయ పార్టీ నాశనం చేస్తోందని మండిపడ్డారు. విభజన, ద్వేషం నింపే రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని ఖర్గే పిలుపునిచ్చారు. ప్రజల కోసం పని చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు.

- Advertisement -

బీజేపీ విధానాలను ఖర్గే తప్పుపట్టారు. కాషాయ పార్టీని గద్దె దించాలన్నదే లక్ష్యమని స్పష్టం చేశారు. ఆరేడు రాష్ట్రాల్లో బీజేపీ అక్రమమార్గంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని ఖర్గే మండిపడ్డారు. కర్నాటకలో కాంగ్రెస్ కు పూర్తి మెజార్టీ ఉన్నా బీజేపీ అనైతికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఆరోపించారు. 18 ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసి వారితో రాజీనామా చేయిందని విమర్శించారు. మధ్యప్రదేశ్‌, గోవా, మణిపుర్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో విపక్ష ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిందన్నారు. అందుకే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగినబుద్ది చెబుతారని ఖర్గే వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఖర్గే జోస్యం చెప్పారు. బీజేపీ పాలనకు చరమగీతం పాడేందుకు ఇతర పార్టీలతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు.

Vivek Ramaswamy : అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. రేసులో వివేక్ రామస్వామి.. ఎవరతను..?

Rahul Gandhi: తనకు పిల్లలు కావాలంటున్న రాహుల్.. మరి, పెళ్లి?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News