E-Paper
Advertisement

Delhi Air Pollution: ఢిల్లీలో పెరుగుతున్న గాలి కాలుష్యం.. వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు..

Delhi Air Pollution: ఢిల్లీలో పెరుగుతున్న గాలి కాలుష్యం.. వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు..
Advertisement

Delhi Air Pollution: అనుకున్నదే జరిగింది. ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పీల్చే గాలి విషపూరితంగా మారడంతో హస్తిన ప్రజలు వ్యాధి బారిన పడుతున్నారు. దీంతో N-95 మాస్క్ ధరించాలని నిపుణులు చెబుతున్నారు. వాయు నాణ్య త కూడా సగటున 414 పాయింట్లకు చేరుకుంది. కాలుష్యం, పొగమంచుతో విజబిలిటీ పూర్తిగా తగ్గింది. మరోవైపు గాలి కాలుష్యంపై అధికార-విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. గత 14రోజులు నుండి గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది.

ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) గాలి కాలుష్యం.. ఆ ప్రాంతాలు.. ఆనంద్ విహార్ (411), బవానా (414), చాందిని చౌక్ (407), నరేలా (407), JLN స్టేడియం (401), బురారి (402), అశోక్ విహార్ (417) మరియు అయా నగర్ (402), ITO (396), అలీపూర్ (355), IGI విమానాశ్రయం (360), నజాఫ్‌గఢ్ (361) ఉన్నాయి.

Advertisement

అటు ఢిల్లీ కాలుష్యంపై.. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కోర్టుల దగ్గర మంత్రదండం లేదన్నారు. శుద్ధమైన గాలి కోసం ఏం ఆదేశించాలో కూడా తెలియడం లేదంటున్నారు. గాలి నాణ్యత తగ్గిన వేళ తాను బయటికి వెళ్లడం.. వాకింగ్ కూడా చేయడం మానేసినట్లు చెప్పారు.

Also Read: దడ పుట్టిస్తున్న బంగారం ధర.. త్వరలో తులం రూ.2 లక్షలు..?

Advertisement

ఇక సమస్యను పరిష్కరించేందుకు కోర్టులు అద్భుతాలు చేయలేవన్నారు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్. ఢిల్లీ కాలుష్య సమస్యకు కారణమేంటనేది అందరికీ తెలుసన్నారు. వాటికి పరిష్కారాన్ని గుర్తించాలని సూచనలు చేశారు. జనం కూడా బయటకు రావాలంటే హడలిపోతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఈ కేసు ప్రతి ఏడాది దీవాళి సమయంలో తెరపైకి వస్తుందని గుర్తు చేశారు.

Related News

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

Big Stories

Advertisement
×