E-Paper
Advertisement

Smriti Mandhana Wedding: ప్చ్ సైలెన్స్… స్మృతి – పలాశ్ పెళ్లి జరుగుతుంది

Smriti Mandhana Wedding: ప్చ్ సైలెన్స్… స్మృతి – పలాశ్ పెళ్లి జరుగుతుంది
Advertisement

Smriti Mandhana Wedding: భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ వివాహం ఊహించని పరిణామంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. తన ప్రియుడు, బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాశ్ తో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైన వేళ.. స్మృతి తండ్రి శ్రీనివాస్ అనారోగ్యం పాలయ్యారు.

Also Read: Harsh Goenka: కోట్ల‌ల్లో న‌ష్టాలు… అమ్మకానికి రెండు IPL జట్లు

Advertisement

గుండెపోటు లక్షణాలతో సాంగ్లీ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోపే స్మృతికి కాబోయే భర్త పలాశ్ కూడా ఆసుపత్రిపాలయ్యాడు. వైరల్ ఇన్ఫెక్షన్, ఎసిడిటీతో అతడు ముంబైలోని గోరేగావ్ ఆసుపత్రిలో చేరాడు. ఇక వీరిద్దరూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు.

 

సోషల్ మీడియాలో ఊహించని వదంతులు:

Advertisement

అనూహ్య పరిణామంతో వీరి పెళ్లి వాయిదా పడడంతో సోషల్ మీడియాలో ఊహించని విధంగా వదంతులు పుట్టుకొచ్చాయి. పలాశ్ కి మరో అమ్మాయితో సంబంధం ఉందని, ఇరు కుటుంబాల మధ్య సఖ్యత చెడిందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. అయితే తన తండ్రి చూడని వేడుక తనకు వద్దంటూ స్మృతి.. తన పెళ్లిని వాయిదా వేసుకుందని ఆమె మేనేజర్ మీడియాకు చెప్పారు. ఆ తర్వాత ఈ రూమర్స్ పై పలాశ్ ముచ్చల్ తల్లి అమితా కూడా స్పందించింది. ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ.. ” స్మృతి తండ్రి అంటే పలాశ్ కి ఎంతగానో ఇష్టం. స్మృతి కంటే ఆమె తండ్రి దగ్గరే పలాశ్ కి సాన్నిహిత్యం ఎక్కువగా ఉంది. స్మృతి తండ్రి శ్రీనివాస్ అనారోగ్యం బారిన పడ్డారని తెలియగానే.. స్మృతి కంటే ముందే పలాశ్ స్పందించాడు. తానే పెళ్లిని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడు. ఆమె తండ్రి కోలుకునేంతవరకు వివాహ వేడుకను వాయిదా వేయాలని చెప్పాడు” అని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ రూమర్స్ ఆగలేదు. దీంతో తాజాగా పలాశ్ తల్లి అమిత మరోసారి ఈ రూమర్స్ పై స్పందించింది.

Also Read: RCB: హెడ్, క్లాసెన్ లాంటి రాక్షసులను బెంగుళూరు వదిలేసిందా.. షాకింగ్ లిస్ట్ ఇదే

 

పలాశ్ – స్మృతి వివాహం అతిత్వరలో జరుగుతుంది:

పలాశ్ ముచ్చల్ తల్లి అమిత తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ.. ” ప్రస్తుతం అంతా బాగానే ఉంది. త్వరలోనే పలాశ్ – స్మృతి వివాహం జరుగుతుంది. ప్రస్తుతం వారిద్దరూ కష్టాల్లో ఉన్నారు. పలాశ్.. స్మృతిని తన అర్ధాంగిగా ఇంటికి తీసుకురావాలని ఎన్నో కలలు కన్నాడు. నేను కూడా స్మృతికి ప్రత్యేకంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాను. వారిద్దరి వివాహం అతి త్వరలోనే జరగబోతోంది”. అని క్లారిటీ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఊహాగానాలకు తెరదించింది. అయితే త్వరలోనే వీరి వివాహం జరగబోతుందని క్లారిటీ ఇచ్చింది కానీ.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రూమర్లపై మాత్రం ఇంతవరకు ఇరు కుటుంబాలు స్పందించలేదు. ఏది ఏమైనా.. త్వరలోనే పలాశ్ – స్మృతి వివాహం జరగబోతుందని తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×