BigTV English

India Vs Pakistan War : పెళ్లైన 3 రోజులకే.. ఆర్మీ నుంచి పిలుపు.. భార్య ఏం చేసిందంటే..

India Vs Pakistan War : పెళ్లైన 3 రోజులకే.. ఆర్మీ నుంచి పిలుపు.. భార్య ఏం చేసిందంటే..

India Vs Pakistan War : అతను ఇండియన్ సోల్జర్. ప్రస్తుతం పెళ్లి సెలవుల్లో ఉన్నాడు. ఇటీవలే బంధువుల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. ఇంకా మూడు రాత్రులు కూడా ముగియలేదు. కాళ్లకు పెట్టుకున్న పారాణి ఆరనేలేదు. ముఖంలో పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇంటి నిండా చుట్టాలతో సందడిగా ఉంది. అంతలోనే ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ నుంచి పిలుపు వచ్చింది. వెంటనే తిరిగొచ్చేసి.. డ్యూటీలో జాయిన్ కావాలని ఆదేశించింది. ఇండియా, పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఇలా సెలవుల్లో ఉన్న జవాన్లు అందరినీ తిరిగి రప్పిస్తోంది ఆర్మీ. అలాంటి వారిలో ఒకడు మహారాష్ట్రకు చెందిన మనోజ్ పాటిల్. కాకపోతే ఇతనిది కొత్త పెళ్లికొడుకు కథ.


3 రోజులకే యుద్ధ భూమికి..

అయ్యో.. పెళ్లై 3 రోజులే అవుతోందిగా. ఇంకా పెళ్లి మురిపం కూడా తీరనేలేదుగా. ఇప్పుడు డ్యూటీ ఏంటి? అందులోనూ బోర్డర్‌లో పాకిస్తాన్‌తో వార్ ఏంటి? అనుకోలేదు ఆ వీర జవాన్. వెంటనే లగేజ్ సర్దేసుకున్నాడు. తాను తిరిగి సరిహద్దులకు వెళ్లిపోవాల్సిందేనని భార్యకు చెప్పాడు. కుటుంబ సభ్యులకూ ఇదే విషయం చెబితే.. అంతా ఉలిక్కిపడ్డారు. ఇరు వర్గాలు అయ్యో అయ్యో అని బాధపడ్డాయి. కానీ.. మనోజ్ భార్య యామిని మాత్రం మరోలా స్పందించింది.


తన సిందూరాన్ని దేశ రక్షణ కోసం..

“నా సిందూరాన్ని దేశ రక్షణ కోసం బోర్డర్‌కు పంపుతున్నా..” అంటూ కన్నీరు నిండిన కళ్లతో భర్తకు సెండాఫ్ చెప్పింది యామిని. ఇక రైల్వే స్టేషన్లో సోల్జర్ మనోజ్ పాటిల్‌ను సాగనంపేందుకు ఇరు కుటుంబాల సభ్యులంతా వచ్చారు. అందరి గుండెల్లోనూ బాధ. అందరి కళ్లల్లోనూ కన్నీరు. వెక్కి వెక్కి ఏడ్చారంతా. అసలు కొత్త పెళ్లికొడుకు. పెళ్లి తంతు జరిగి ముచ్చటగా మూడు రోజులు కూడా కాలేదు. అంతలోనే యుద్ధం చేసేందుకు సరిహద్దులకు వెళుతున్నాడు మనోజ్. ఇప్పటికే బోర్డర్‌లో పాకిస్తాన్ విచ్చలవిడిగా కాల్పులకు తెగబడుతోంది. పాక్ ఫైరింగ్‌లో మన జవాన్లు మరణించారనే వార్తలు వస్తున్నాయి. ఇంతటి డేంజరస్ వార్ జోన్‌లోకి కొత్త పెళ్లికొడుకు వెళుతున్నాడంటే ఎవరికైనా బాధ ఉంటుందిగా.

భర్తకు వీర తిలకం దిద్దిన భార్య

అంతటి బాధను దిగమింగుకొని మరీ.. తన భర్తకు వీర తిలకం దిద్ది బోర్డర్‌కు పంపించింది ఆ కొత్త పెళ్లికూతురు యామిని. పాపం ఆ యువతి.. ఏడుస్తూనే ఉంది. అయినా, వెళ్లొద్దంటూ భర్తకు అడ్డు చెప్పలేదు. నా సిందూరాన్ని దేశ రక్షణ కోసం బోర్డర్‌కు పంపిస్తున్నానంటూ కన్నీళ్లు నిండిన కళ్లతో గర్వంగా సాగనంపింది. అక్కడ ఉన్న ప్రతీవారిలో దేశభక్తి తొణికిసలాడింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జవాన్ మనోజ్ పాటిల్‌కు, వీర పత్ని యామినికి నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు.

Also Read : బోర్డర్‌లో హైరేంజ్ వార్.. ఇదిగో కంప్లీట్ డీటైల్స్

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×