Venu Swamy Prediction: భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ గుండెల్లో పరుగులు పెట్టిస్తోంది. పాక్ పాలకులకు టన్నుల కొద్ది భయం పట్టుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో తొమ్మిది ఉగ్రవాద శిబరాలపై దాడులు జరిగిన తర్వాత పరిణామాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. పాకిస్థాన్ వందలాది డ్రోన్లతో అటాక్ చేస్తుంటే.. భారత్ ఎదురుదాడులు చేస్తూ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. భారత్ లోని కొన్ని ముఖ్య ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులకు దిగుతోంది. పాక్ దాడులను భారత త్రివిధ దళాలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో పాక్ ను తగిన బుద్ధి చెప్పాలని ప్రతి భారతీయుడు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
భారత్ – పాక్ యుద్ధంపై వేణు స్వామి జోష్యం చెప్పారు. ‘భారత్ తో పాకిస్తాన్ యుద్ధం జరుగుతుందని నేను ముందే చెప్పా. యుద్ధంతో 80% నాశనం అవుతుంది. షష్ఠ గ్రహ కూటమి వల్ల యుద్ధం జరుగుతోందని నేను ఇంతకుముందే చెప్పాను. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ సంచలనాలు ఉంటాయి. పెద్ద నాయకులు, నటులు మరణిస్తారు. ఆర్ధిక మాంద్యం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read: Indian Jawan Died: బ్రేకింగ్.. పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం