E-Paper
Advertisement

రహస్యాల లీక్ ఎఫెక్ట్.. సైనికులకు 87 యాప్‌లు బ్యాన్.. ఇన్‌స్టా, ఎక్స్‌ పోస్టులపై నిషేధం!

రహస్యాల లీక్ ఎఫెక్ట్.. సైనికులకు 87 యాప్‌లు బ్యాన్.. ఇన్‌స్టా, ఎక్స్‌ పోస్టులపై నిషేధం!
Advertisement

Army Social Media: వరుసగా వెలుగు చూస్తున్న హనీట్రాప్​ లు.. రహస్య సమాచార లీకేజీలతో భారత రక్షణ శాఖ అలర్ట్​ అయ్యింది. ఈ క్రమంలో సైన్యంలో 87 సోషల్ మీడియా యాప్​ల వాడకంపై నిషేధం విధించింది. దాంతో పాటు సాయుధ బలగాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవల పాక్​ గూఢచారి సంస్థ ఐఎస్​ఐ ఏజెంట్​ విసిరిన హనీట్రాప్​ లో చిక్కుకున్న భారత వైమానిక దళ వింగ్​ కమాండర్​ ఒకరు అత్యంత కీలకమైన రక్షణ సమాచారాన్ని లీక్​ చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఏజెంట్ పంపించిన నగ్న ఫోటోలకు బదులుగా వింగ్ కమాండర్ రహస్య యుద్ధ ప్రణాళికల్లోని ఒక్కో పేజీని అప్‌ లోడ్ చేసినట్టుగా విచారణలో వెల్లడైంది. పాకిస్తాన్ ఏజెంట్‌ కు చేరవేసిన సమాచారంలో ఓ రహస్య డ్రోన్ విభాగం బలం, దాని నిర్మాణం, డ్రోన్ పరీక్షల ఫలితాలు, ఆయుధ సామర్థ్యం, యుద్ధ సమయాల్లో వాటిని మోహరించే ప్రాంతాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.

Advertisement

దాంతోపాటు లేహ్ ప్రాంతంలో మోహరించిన ఫైటర్ ఎయిర్‌ క్రాఫ్ట్‌ల వివరాలు, ఫ్రంట్‌లైన్ యుద్ధ విమానాల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని కూడా వింగ్ కమాండర్​ లీక్ చేశాడు. అదే విధంగా రాజస్థాన్‌ సూరత్‌ ఘడ్ సమీపంలోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌ లో జరిగిన సైనిక విన్యాసాల వివరాలు, సున్నితమైన సైనిక స్థావరాల కోఆర్డినేట్‌ లను పాక్​ ఏజెంట్​ తో పంచుకున్నాడు. గతంలో కూడా ఇలాంటి ఉదంతాలు ఎన్నో వెలుగు చూశాయి.

ఈ క్రమంలోనే ఫేస్‌ బుక్, స్నాప్‌ చాట్, టిక్‌ టాక్, పబ్జీ, టిండర్, షీన్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్, మెసేజింగ్, గేమింగ్, ఈ-కామర్స్ సహా 87 యాప్‌ లను సిబ్బంది వాడకుండా సైన్యం చర్యలు చేపట్టింది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఇన్‌ స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, కోరా వంటి వేదికలను కేవలం సమాచారం లేదా విజ్ఞాన సముపార్జనకు, వీక్షించటానికి మాత్రమే ఉపయోగించాలి. ఈ వేదికలపై పోస్టులు పెట్టడం, లైక్‌ లు కొట్టడం, కామెంట్లు చేయడం, వ్యక్తిగత అభిప్రాయాలు పంచుకోవడం పూర్తిగా నిషిద్ధం.

Advertisement

Also Read: బీజేపీ vs టీవీకే.. తిరుపరన్‌కుండ్రంలో హైటెన్షన్.. 10 వేల మంది పోలీసుల మోహరింపు!

వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్కైప్ వంటి వాటిలో తెలిసిన వ్యక్తులతో మాత్రమే సాధారణ సమాచారాన్ని పంచుకోవడానికి సైన్యం అనుమతిచ్చింది. అవతలి వ్యక్తి ఎలాంటివాడు? అన్నది గుర్తించే బాధ్యత పూర్తిగా సిబ్బందిదే. లింక్​ డెన్​ ను రెజ్యూమ్ అప్‌ లోడ్ చేయడానికి, ఉద్యోగ సంబంధిత సమాచారం తెలుసుకోవడానికి మాత్రమే పరిమితం చేశారు. సైనికులు పంచుకునే ఫొటోలు, వీడియోలు, వ్యక్తిగత వివరాల ద్వారా సున్నితమైన సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలోనే ఈ ఆంక్షలు విధించారు.

Also Read: అల్లు అర్జున్ తర్వాత మళ్లీ శర్వానంద్‌కే నేషనల్ అవార్డు.. సంపత్ నంది వైరల్ కామెంట్స్ !

Tags

Related News

బీజేపీ vs టీవీకే.. తిరుపరన్‌కుండ్రంలో హైటెన్షన్.. 10 వేల మంది పోలీసుల మోహరింపు!

లాడ్జిలో ఘర్షణ.. ప్రియుడు తోసేయడంతో కిటికీలోంచి పడి యువతి మృతి!

నెంబర్ ప్లేట్ దాస్తే భారీ మూల్యం.. టోల్ ఎగ్గొట్టే ఎత్తులకు కేంద్రం చెక్, దొరికితే 8 రెట్లు ఫైన్!

పంజాబ్‌ను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారి.. దేశమంతా విస్తరించకుండా కేంద్రం కీలక నిర్ణయం!

కలెక్టర్‌పై లైంగిక వేధింపుల కేసు.. TVK ఎమ్మెల్యేను కాపాడుతున్నారా? విజయ్ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం!

పోలీస్ స్టేషన్‌లో కత్తితో దుండగుడి దాడి.. 9 మంది పోలీసులకు గాయాలు, చివరికి ఎలా చిక్కాడంటే?

వివాహంలో కారు చిచ్చు.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న పెళ్లి కొడుకు, కష్టాల్లో వరుడు, హర్యానాలో ఘటన

Big Stories

Advertisement
×