Bhogi Movie:రచ్చ, బెంగాల్ టైగర్,గౌతమ్ నందా అంటూ పలు డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు తీసి సక్సెస్ అందుకున్న సంపత్ నంది తాజాగా
శర్వానంద్‌తో భోగి అనే సినిమాని తెరకెక్కించిన సంగతి తెల్సిందే .ఇక ఈ సినిమా నవంబర్ 27న ఆడియన్స్ ని అలరించేందుకు రెడీ అయిపొయింది.ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సంపత్ నంది శర్వా గురించి ఇలా పలు విషయాలు చెప్పుకొచ్చాడు.
.సాధారణంగా ఇండస్ట్రీలో కొందరు దర్శకులు హిట్ ఫార్ములాలను ఫాలో అవుతుంటే, మరికొందరు తమ సొంత ఆలోచనలతో కొత్తగా ప్రయత్నిస్తుంటారని . తాను మాత్రం తన జీవితంలో చూసిన సంఘటనలు, అనుభవాల నుంచే కథలు రాసుకుంటానని క్లారిటీ ఇచ్చాడు.
వేరే సినిమాల సీన్లను కాపీ కొట్టడం తనకు అస్సలు చేతకాదని, తనకు నచ్చిన కథ దొరికినప్పుడే దర్శకత్వం చేస్తానని, లేదంటే తన దగ్గర పనిచేసే వాళ్లకు అవకాశాలు ఇస్తానని చెప్పుకొచ్చాడు.
ఇక ఈ సినిమాలో శర్వానంద్ నటన గురించి మాట్లాడుతూ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్‌లో శర్వానంద్ దాదాపు నాలుగున్నర నిమిషాల పాటు చేసిన నటన చూసి తాను షాక్ అయ్యానని, ఆ సీన్ అవ్వగానే సెట్‌లో ఉన్న దాదాపు 300 మంది చప్పట్లు కొట్టారని గుర్తుచేసుకున్నారు.
క్లైమాక్స్‌లోనూ శర్వా అద్భుతంగా నటించారని, అల్లు అర్జున్‌కు వచ్చినట్టే శర్వానంద్‌కు కూడా ఈ సినిమాతో నేషనల్ అవార్డు రేంజ్ గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పడం ఇక్కడ విశేషం.అయితే ఇది కేవలం ప్రమోషన్ కోసం చెబుతున్న మాట కాదని, కళ్లారా చూసిన నటనకు ఇస్తున్న ప్రశంస అని శర్వాని ఆకాశానికి ఎత్తేశాడు..
ఇక 1960ల నాటి తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా కోసం అప్పటి గ్రామీణ భాషను వాడినట్లు తెలిపాడు. కేవలం ఉర్దూ పదాలు ఉండే హైదరాబాద్ యాస కాకుండా, పల్లెటూరి పదాలు కూడా ఉండాలని లిరిసిస్ట్ చంద్రబోస్‌తో కలిసి పనిచేశామని వివరించాడు.ఇక శర్వానంద్ కూడా రోజూ సెట్‌కు రాగానే డైలాగ్స్ చదువుకుని ఒకసారి పాత్రలోకి వెళ్తే సాయంత్రం వరకు అదే మూడ్‌లో ఉండేవారని మెచ్చుకున్నాడు ఈ క్రేజీ ఫిలిమ్ మేకర్.
ఇక ఈ సినిమాలోని ‘ఎగిలివారంగా’ పాట వెనుక ఓ ఎమోషనల్ స్టోరీ ఉందని చిన్నప్పుడు తన నాన్న ‘ఎగిలివారంగా లేవాలి కదరా’ అనేవారని, ఆ పదంతో పాటు మిద్దె రాములు ఒగ్గు కథల స్టైల్‌లో పాట రాయాలని చంద్రబోస్‌కు చెప్పానని తెలిపాడు.
ఒక్క బూతు పదం కూడా లేకుండా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా చంద్రబోస్ ఆ పాట రాశారని, భీమ్స్ సిసిరోలియో ఇచ్చిన కొత్త రిథమ్ వినగానే ఒక్క మార్పు కూడా చెప్పకుండా ఓకే చేశానని చెప్పుకొచ్చాడు.
మొత్తంగా ఈ సినిమాతో శర్వాకి నేషనల్ అవార్డు పక్కా అంటున్న సంపత్ నంది కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ,మరి సంపత్ నందిని అబ్బురపరిచేందటగా శర్వా ఎలాంటి ఫెర్ఫామెన్స్ ఇచ్చాడో ఈ నెల 27న తేలిపోతుంది !
ALSO READ:అప్పుడు గాజులు.. ఇప్పుడు గజ్జెలు.. ప్రతిసారీ అదే పాట ఫార్ములానా?