E-Paper
Advertisement

నెంబర్ ప్లేట్ దాస్తే భారీ మూల్యం.. టోల్ ఎగ్గొట్టే ఎత్తులకు కేంద్రం చెక్, దొరికితే 8 రెట్లు ఫైన్!

నెంబర్ ప్లేట్ దాస్తే  భారీ మూల్యం.. టోల్ ఎగ్గొట్టే ఎత్తులకు కేంద్రం చెక్, దొరికితే 8 రెట్లు ఫైన్!
Advertisement

New Toll Penalty: టోల్ ప్లాజాల వద్ద చెల్లింపుల నుంచి తప్పించు కోవడానికి వాహనదారుల ఎత్తులకు చెక్ పెట్టేందుకు కీలక అడుగులు వేస్తోంది కేంద్రం. నెంబర్ ప్లేట్‌ను మార్చడం, కొంతభాగాన్ని దాచి పెట్టడం వంటివి చేస్తే వాహనదారులు భారీ మూల్యం తప్పదు. అలాంటి వాహనాన్ని గుర్తించిన తర్వాత టోల్ రుసుము కంటే నాలుగు నుంచి ఎనిమిది రెట్ల జరిమానా విధించాలని భావిస్తోంది.

టోల్ ప్లాజాల వద్ద కొత్త పద్దతి

దేశంలో అడ్డంకులు లేని టోలింగ్ వ్యవస్థను అమలు చేస్తోంది కేంద్రం. ఈ వ్యవస్థ కింద వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదు. కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ వ్యవస్థలను ఉపయోగించి టోల్ పన్నులు వాటంతట అవే వసూలు చేస్తాయి. కొత్త వ్యవస్థ ఒక పెద్ద సవాల్ ఎదుర్కొంటోంది. కొంతమంది వాహన యజమానులు టోల్ పన్నులు చెల్లించకుండా తప్పించుకోవడానికి తమ వాహనాల నంబర్ ప్లేట్లను తారుమారు చేస్తున్నారు. కొందరు నంబర్ ప్లేట్‌లోని కొంత భాగాన్ని దాచిపెడుతున్నారు. కెమెరాలు వారి వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌ను చూడకుండా ఉండేలా అడ్డుకుంటున్నారు.

Advertisement

ఈ సమస్యను పరిష్కరించడానికి రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ జాతీయ రహదారి రుసుము నిబంధనలకు మార్పులు చేస్తోంది. ఈ ప్రతిపాదన ప్రకారం.. తమ నంబర్ ప్లేట్లను తారుమారు చేయడం, దాచిపెట్టడం ద్వారా టోల్ ఎగవేస్తున్నట్లు తేలిన వాహనదారులకు టోల్ రుసుము కంటే నాలుగు నుంచి ఎనిమిది రెట్లు ఎక్కువ జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ వ్యవస్థను అమలు చేయడానికి ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-AI ను ఉపయోగించడానికి రెడీ అయ్యింది.

టోల్ ఎగ్గొట్టే ఎత్తులకు కేంద్రం చెక్, దొరికితే 8 రెట్లు ఫైన్!

టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల నుండి సేకరించిన చిత్రాలు, ఇతర సమాచారాన్ని విశ్లేషించి రాబోయే కొద్ది నెలల్లో ఓ వ్యవస్థను రెడీ చేయనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  నంబర్ ప్లేట్లు తారుమారు చేయడం, రిజిస్ట్రేషన్ నంబర్లు ఉద్దేశపూర్వకంగా దాచి పెట్టిన వాహనాలను గుర్తిస్తుంది. దీనిపై రాష్ట్రాల రవాణా శాఖ- నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా బాధ్యతలు భిన్నంగా ఉంటాయి.

Advertisement

నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేసినందుకు మోటార్ వెహికల్స్ చట్టం కింద చర్యలు తీసుకోవడానికి, భారీ జరిమానాలు విధించడానికి వివిధ రాష్ట్రాల రవాణా శాఖకు అధికారం ఉండనుంది. సాధారణ టోల్‌కు అదనంగా రుసుములు వసూలు చేసే బాధ్యత NHAI వంటి హైవే అథారిటీలకు ఉంటుంది. టోల్ ఎగవేతకు సంబంధించిన గతంలో ఆందోళన వ్యక్తం చేసింది. అడ్డంకులు లేని టోల్ వ్యవస్థ ప్రవేశపెట్టిన తర్వాత కొంతమంది వాహన యజమానులు తమ నంబర్ ప్లేట్లను తారుమారు చేసి తప్పించు కోవడానికి  ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.

ALSO READ: పంజాబ్‌ను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారి.. దేశమంతా విస్తరించకుండా కేంద్రం కీలక నిర్ణయం!

ఢిల్లీలోని ముండ్కా టోల్ ప్లాజా వద్ద అడ్డంకులు లేని టోలింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టిన కొద్దిరోజులకు ఈ సమస్యపై నిరంతర పర్యవేక్షణ చేయాలని కోరుతూ NHAI.. ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించి నప్పుడు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలకు NHAI ఈ విషయాన్ని తీసుకెళ్లనుంది. ప్రస్తుత మోటారు వాహన చట్టం ప్రకారం.. నంబర్ ప్లేట్‌ను తారుమారు చేయడం శిక్షార్హమైన నేరం. మొదటిసారి నేరం చేసిన వారికి రూ. 5 వేలు జరిమానా విధించవచ్చు.

పదే పదే ఉల్లంఘిస్తే రూ. 10 వేలు జరిమానా. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న కొత్త పద్దతితో వాహన యజమానులు జరిమానాను నాలుగు నుండి ఎనిమిది రెట్ల టోల్ పన్ను చెల్లించవలసి రావచ్చు. అన్ని వాహనాలకు హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు-HSRP అమర్చేంత వరకు లేదా వాటి నంబర్ ప్లేట్లు కెమెరాలకు సులభంగా కనిపించేలా ఉండేంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.

Related News

పంజాబ్‌ను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారి.. దేశమంతా విస్తరించకుండా కేంద్రం కీలక నిర్ణయం!

కలెక్టర్‌పై లైంగిక వేధింపుల కేసు.. TVK ఎమ్మెల్యేను కాపాడుతున్నారా? విజయ్ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం!

పోలీస్ స్టేషన్‌లో కత్తితో దుండగుడి దాడి.. 9 మంది పోలీసులకు గాయాలు, చివరికి ఎలా చిక్కాడంటే?

వివాహంలో కారు చిచ్చు.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న పెళ్లి కొడుకు, కష్టాల్లో వరుడు, హర్యానాలో ఘటన

ప్రియురాల్ని చంపిన టెక్కీ.. రాత్రంతా మృతదేహం పక్కనే, ఆ తర్వాత ఏం చేశాడంటే, పూణెలో షాకింగ్ ఘటన

త్వరలో మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే..?

‘బాహుబలిలా ప్రవర్తించడం ఆపండి’.. బిహార్ సెషన్స్ జడ్జిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం!

Big Stories

Advertisement
×