Karnataka Crime: ప్రేమ పేరుతో కలిసి బతకాలనుకున్న ఆ జంట మధ్య చిన్నపాటి మనస్పర్థలే నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. కర్ణాటకలోని గంగమ్మగుడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. హాసన్‌కు చెందిన 23 ఏళ్ల ఐశ్వర్య, తన ప్రియుడు సంతోష్‌తో కలిసి ఓ లాడ్జికి వెళ్లింది. అక్కడ ఇద్దరి మధ్య ఏదో విషయంపై తీవ్ర వాగ్వాదం మొదలైంది.
అసలేం జరిగిందంటే..
మాటామాటా పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఐశ్వర్య, తనను ఎవరూ నమ్మడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమయంలో ఆవేశానికి లోనైన సంతోష్ ఆమెను బలంగా నెట్టేశాడు. దీంతో అదుపుతప్పిన ఐశ్వర్య నేరుగా లాడ్జి కిటికీలోంచి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు సంతోష్‌పై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
💔 లాడ్జిలో గొడవ.. ప్రియుడు తోసేయడంతో కిటికీలోంచి పడి యువతి మృతి
📝 కర్ణాటకలోని గంగమ్మగుడి పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 19న హాసన్‌కు చెందిన ఐశ్వర్య(23), ప్రియుడు సంతోష్‌తో కలిసి ఓ లాడ్జికి వెళ్లింది.
📝 అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా, తనను ఎవరూ నమ్మడం లేదని ఐశ్వర్య… pic.twitter.com/0znBoBUf34
— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) November 24, 2026
Also Read: బీజేపీ డౌన్ అవుతుంది.. మోదీ మళ్లీ అధికారంలోకి రారు: వి. హనుమంత రావు