E-Paper
Advertisement

బీజేపీ vs టీవీకే.. తిరుపరన్‌కుండ్రంలో హైటెన్షన్.. 10 వేల మంది పోలీసుల మోహరింపు!

బీజేపీ vs టీవీకే.. తిరుపరన్‌కుండ్రంలో హైటెన్షన్.. 10 వేల మంది పోలీసుల మోహరింపు!
Advertisement

Tamil Nadu Deepam Row: తమిళనాడులోని తిరుపరన్‌కుండ్రం ‘దీపతూణ్’ వద్ద దీపం వెలిగించే విషయంలో తలెత్తిన వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా విజయ్ నేతృత్వంలోని అధికార టీవీకే (TVK) ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ మంగళవారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

హౌస్ అరెస్ట్ ఆరోపణలు

కార్తీక దీపం వేడుకల కోసం తిరుపరన్‌కుండ్రం వెళ్తున్న తనను తిరునెల్వేలిలో పోలీసులు గృహనిర్బంధం (హౌస్ అరెస్ట్) చేశారని నాగేంద్రన్ ఆరోపించారు. ఇది తన ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని ఆయన అన్నారు. ‘సుప్రీంకోర్టు దీపం వెలిగించేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ ముఖ్యమంత్రి దానికి వ్యతిరేకంగా రివ్యూ పిటిషన్ వేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ నేతలు, హిందూ కార్యకర్తలను అరెస్ట్ చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10,000 మంది పోలీసులను మోహరించారు’ అని ఆయన విమర్శించారు.

టీవీకే ప్రభుత్వ వివరణ..

Advertisement

మరోవైపు అధికార టీవీకే పార్టీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఏ ఒక్క భక్తుడినీ పూజలు చేసుకోకుండా అడ్డుకోలేదని స్పష్టం చేసింది. మరోవైపు నిషేధాజ్ఞల ఉల్లంఘన కింద రాష్ట్రవ్యాప్తంగా 258 మందిని మాత్రమే అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో ఈ వివాదం మరోసారి న్యాయస్థానం ముందుకు రాగా మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం మంగళవారం సాయంత్రం తిరుపరన్‌కుండ్రం ‘దీపతూణ్’ వద్ద సంప్రదాయ దీపాన్ని వెలిగించేందుకు చర్యలు తీసుకోవాలని మదురై కలెక్టర్, ఇతర అధికారులను ఆదేశించింది. అంతేకాకుండా నిషేధాజ్ఞల కింద పోలీసులు అదుపులోకి తీసుకున్న వారందరినీ తక్షణమే విడుదల చేయాలని స్పష్టం చేసింది.

Also Read: దోమలు మిమ్మల్నే ఎక్కువగా కుడుతున్నాయా? బ్లడ్ గ్రూప్ మాత్రమే కాదు.. అసలు కారణాలివే!

వివాద నేపథ్యం.. కోర్టుల తీర్పులు

Advertisement

నవంబర్ 20న జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం.. నవంబర్ 24న ఒక్కసారి మాత్రమే కఠిన షరతులతో దీపం వెలిగించేందుకు అనుమతి ఇచ్చింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం స్టే కోరుతూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే వివాదం గతేడాది నవంబర్ లోనే మొదలైంది. కొండపై ఉన్న దీపతూణ్ (దీప స్తంభం).. దర్గాకు సమీపంలో ఉండటంతో శాంతిభద్రతల కారణాలు చూపుతూ స్థానిక అధికారులు అప్పట్లో అనుమతి నిరాకరించారు. అయితే, దర్గాకు 50 మీటర్ల కంటే ఎక్కువ దూరంలోనే ఆ స్తంభం ఉందని పేర్కొంటూ 2025 డిసెంబర్‌లో మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి దీపం వెలిగించేందుకు అనుమతి ఇచ్చారు. దీనిపై ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ న్యాయపోరాటం కొనసాగుతోంది.

Also Read: అదంతా స్క్రిప్ట్.. తప్పుగా అర్థం చేసుకోవద్దు.. రోహిత్ నాయుడు సంచలన పోస్ట్!

Tags

Related News

లాడ్జిలో ఘర్షణ.. ప్రియుడు తోసేయడంతో కిటికీలోంచి పడి యువతి మృతి!

నెంబర్ ప్లేట్ దాస్తే భారీ మూల్యం.. టోల్ ఎగ్గొట్టే ఎత్తులకు కేంద్రం చెక్, దొరికితే 8 రెట్లు ఫైన్!

పంజాబ్‌ను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారి.. దేశమంతా విస్తరించకుండా కేంద్రం కీలక నిర్ణయం!

కలెక్టర్‌పై లైంగిక వేధింపుల కేసు.. TVK ఎమ్మెల్యేను కాపాడుతున్నారా? విజయ్ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం!

పోలీస్ స్టేషన్‌లో కత్తితో దుండగుడి దాడి.. 9 మంది పోలీసులకు గాయాలు, చివరికి ఎలా చిక్కాడంటే?

వివాహంలో కారు చిచ్చు.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న పెళ్లి కొడుకు, కష్టాల్లో వరుడు, హర్యానాలో ఘటన

ప్రియురాల్ని చంపిన టెక్కీ.. రాత్రంతా మృతదేహం పక్కనే, ఆ తర్వాత ఏం చేశాడంటే, పూణెలో షాకింగ్ ఘటన

Big Stories

Advertisement
×