E-Paper
Advertisement

పంజాబ్‌ను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారి.. దేశమంతా విస్తరించకుండా కేంద్రం కీలక నిర్ణయం!

పంజాబ్‌ను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారి.. దేశమంతా విస్తరించకుండా కేంద్రం కీలక నిర్ణయం!
Advertisement

Drug Free India: ఒకప్పుడు గొప్ప ఆవిష్కరణలకు పేరుగాంచిన పంజాబ్ ఇప్పుడు డ్రగ్స్ బారిన పడి సతమతమతుంది. చుట్టుపక్కల రాష్ట్రాలకూ ఈ ముప్పు పాకుతుండటం నిజంగా ఆందోళన కలిగించే విషయం. మన యువతను, దేశ భవిష్యత్తును కాపాడుకోవాలంటే అందరం కలిసి నిలబడాల్సిన సమయం వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రెండేళ్లుగా చర్చించి నషాముక్త్ భారత్ కార్యాచరణ రూపొందించామన్నారు.

మూడు స్థాయిల్లో టార్గెట్, కఠిన చర్యలు

Advertisement

డ్రగ్స్ సొమ్మును కొందరు దేశ వ్యతిరేక పనులకు వాడుతుండటం ప్రమాదకరం. తయారీదారులు, సరఫరా చేసేవారు, వాడేవారు.. ఈ మూడింటినీ వదలకూడదని నిర్ణయించారు. న్యూక్లియర్ కుటుంబాల వల్ల కూడా ఈ సమస్య పెరుగుతోంది. ఇది కేవలం పెద్ద కుటుంబాల సమస్య కాదు. బీపీఎల్ కుటుంబాల్లోని పిల్లలూ గంజాయికి అలవాటు పడుతున్నారు. అంచనాల ప్రకారం గంజాయి వాడేవారు 2.46 కోట్లు, అప్పుడప్పుడు వాడేవారు 3 కోట్లు, డ్రగ్ ఇన్ఫెక్షన్ తీసుకునేవారు 8 లక్షల మంది ఉన్నారు.

పునరావాసం, శిక్షణ, అంతర్జాతీయ ఒప్పందాలు

Advertisement

గ్రామం నుంచి జాతీయ స్థాయి వరకు అధికారులు, ప్రత్యేక కమిటీలు, అవగాహన కార్యక్రమాలు చేపడతారు. డ్రగ్స్ మూలాలపై సమాచారం సేకరిస్తూనే.. పోలీసు, రక్షణ విభాగాలను బలోపేతం చేసి జాగిలాల సంఖ్య పెంచుతారు. పునరావాస కేంద్రాలను 300 నుంచి 2 వేలకు పెంచి, బాధితులకు ఉపాధి చూపుతారు. 50 కోట్ల మందికి శిక్షణ ఇచ్చి, 2029లోపు వంద వారాల్లో డ్రగ్ ఫ్రీ నేషన్ లక్ష్యాన్ని చేరుకుంటారు. విదేశీ స్మగ్లర్లపై చర్యలకు ఆయా దేశాలతో ఎంఓయూలు కుదుర్చుకుంటారు.

మూడు రోజుల పాదయాత్రతో తొలి అడుగు

ప్రతి ఒక్కరూ డ్రగ్ ఫ్రీ ఇండియా వారియర్‌గా మారి ‘సే నో టు డ్రగ్’ నినాదాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలి. మొదటి దశలో భాగంగా మూడు రోజుల పాదయాత్ర చేపడతారు. తొలి రోజు అంబర్‌పేట నుంచి ముషీరాబాద్‌లో బస, రెండో రోజు గోల్కొండ ఎక్స్‌రోడ్ నుంచి అమీర్‌పేట సత్యం థియేటర్ వద్ద బస, మూడో రోజు సత్యం థియేటర్ నుంచి ఫిలింనగర్‌లో ముగింపు సభతో ఈ ప్రచారం దేశవ్యాప్తంగా సాగుతుంది.

Also Read: ‘నువ్వు మొగోడివైతే రారా చూసుకుందాం’.. పెద్దారెడ్డిపై రెచ్చిపోయిన జేసీ!

Tags

Related News

కలెక్టర్‌పై లైంగిక వేధింపుల కేసు.. TVK ఎమ్మెల్యేను కాపాడుతున్నారా? విజయ్ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం!

పోలీస్ స్టేషన్‌లో కత్తితో దుండగుడి దాడి.. 9 మంది పోలీసులకు గాయాలు, చివరికి ఎలా చిక్కాడంటే?

వివాహంలో కారు చిచ్చు.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న పెళ్లి కొడుకు, కష్టాల్లో వరుడు, హర్యానాలో ఘటన

ప్రియురాల్ని చంపిన టెక్కీ.. రాత్రంతా మృతదేహం పక్కనే, ఆ తర్వాత ఏం చేశాడంటే, పూణెలో షాకింగ్ ఘటన

త్వరలో మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే..?

‘బాహుబలిలా ప్రవర్తించడం ఆపండి’.. బిహార్ సెషన్స్ జడ్జిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం!

రూ. 2 కోట్ల నోట్ల దండలు.. వరులకు బావమరిది బంపర్ గిఫ్ట్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×