E-Paper
Advertisement

పోలీస్ స్టేషన్‌లో కత్తితో దుండగుడి దాడి.. 9 మంది పోలీసులకు గాయాలు, చివరికి ఎలా చిక్కాడంటే?

పోలీస్ స్టేషన్‌లో కత్తితో దుండగుడి దాడి.. 9 మంది పోలీసులకు గాయాలు, చివరికి ఎలా చిక్కాడంటే?
Advertisement

Delhi Police Attack: దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఊహించని, భయానక ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్ స్టేషన్‌కే ఒక వ్యక్తి ఏకంగా కత్తితో వచ్చి పోలీసులపైనే విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఢిల్లీలోని జామా మసీదు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా పెను కలకలం రేపుతోంది.

అసలేం జరిగిందంటే?

Advertisement

జామా మసీదు ప్రాంతానికి చెందిన నబీల్ అనే వ్యక్తి తమను నిత్యం వేధిస్తున్నాడంటూ అతడి తల్లి, సోదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపేందుకు పోలీసులు నబీల్‌ను స్టేషన్‌కు పిలిపించారు. మొదట్లో స్టేషన్‌కు వచ్చేందుకు నిరాకరించిన నబీల్, కాసేపటి తర్వాత లోపలికి అడుగుపెట్టాడు.

స్టేషన్‌లోనే కత్తితో వీరంగం

Advertisement

లోపలికి రాగానే ‘నన్ను స్టేషన్‌కు పిలిచింది ఎవరు?’ అంటూ నబీల్ ఆగ్రహంతో ప్రశ్నించాడు. తానే పిలిచానని ఎస్ఐ అజయ్ బదులిచ్చారు. దీంతో నబీల్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. తన జేబులో ముందే దాచుకున్న ఒక చిన్న కత్తిని బయటకు తీసి ఎస్ఐ అజయ్‌పై దాడి చేశాడు. ఇది చూసి షాక్ అయిన తోటి పోలీసులు అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిపైనా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు ఎస్ఐలు, ఒక ఏఎస్ఐతో పాటు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు.

పారిపోతూ మరోసారి దాడి.. కాల్పులతో అదుపులోకి!

పోలీసులపై దాడి చేసిన వెంటనే నబీల్ అక్కడి నుంచి ఒక బైక్ దొంగిలించుకుని పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన ఆపరేషన్స్ యూనిట్ పోలీసులు అతడిని వెంబడించి, చిట్లీ ఖబర్ ప్రాంతంలో పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే, అక్కడ కూడా నబీల్ లొంగిపోకుండా పోలీసులపై మళ్లీ కత్తితో దాడి చేసి నలుగురు కానిస్టేబుళ్లను గాయపరిచాడు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పోలీసులు కాల్పులు జరిపి ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ రెండు దాడుల్లో కలిపి మొత్తం 9 మంది పోలీసులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఫ్రెండ్ యాప్‌లో పరిచయం..కోటీశ్వరుడినంటూ బిల్డప్.. మహిళ మంగళసూత్రం కాజేసిన మెకానిక్

Tags

Related News

వివాహంలో కారు చిచ్చు.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న పెళ్లి కొడుకు, కష్టాల్లో వరుడు, హర్యానాలో ఘటన

ప్రియురాల్ని చంపిన టెక్కీ.. రాత్రంతా మృతదేహం పక్కనే, ఆ తర్వాత ఏం చేశాడంటే, పూణెలో షాకింగ్ ఘటన

త్వరలో మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే..?

‘బాహుబలిలా ప్రవర్తించడం ఆపండి’.. బిహార్ సెషన్స్ జడ్జిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం!

రూ. 2 కోట్ల నోట్ల దండలు.. వరులకు బావమరిది బంపర్ గిఫ్ట్.. వీడియో వైరల్!

యూపీలో సీట్ల కుస్తీ.. కాంగ్రెస్, ఎస్పీ మధ్య తేలని పొత్తు లెక్కలు.. ఢిల్లీలో 15 నిమిషాలకే ముగిసిన భేటి!

తండ్రి వీలునామాలో పేరు లేకున్నా ఆస్తిలో వాటా పొందిన కొడుకు.. సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే

Big Stories

Advertisement
×