BigTV English

Iphone stolen in Vrindavan | గుడిలో భక్తుడి ఐఫోన్ చోరీ.. అందరూ చూస్తున్నా బెదరని దొంగ?

Iphone stolen in Vrindavan | ఈ రోజుల్లో అందరూ ఖరీదైన స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో ఈ స్మార్ట్ ఫోన్లు ఉండేసరికి.. దొంగలకు ఇవి ఈజీ టార్గెట్‌గా మారిపోయాయి. స్మోర్ట్ ఫోన్ చోరీల ఫిర్యాదులు కూడా పోలీస్ స్టేషన్లలో ఎక్కువైపోయాయి. రద్దీగా ఉండే ప్రదేశాలలోనే సెల్ ఫోన్స్ దొంగతనాలు జరుగుతుంటాయి. అందుకే తాజాగా ఓ ప్రముఖ దేవాలయంలో ఓ భక్తుడి ఐఫోన్ చోరీ అయింది.

విశేషమేమిటంటే.. అందరికీ ఆ దొంగ ఎవరో తెలిసినా.. ఏమీ చేయలేని పరిస్థితి. ఆ దొంగ అందరికీ అందకుండా ఎత్తైన గోడపై కూర్చున్నాడు. ఐఫోన్ యజమాని అయిన భక్తుడు, అతని మిత్రులు ఆ దొంగను భయపడించారు, ఫలితం లేకపోవడంతో ఫ్రాదేయపడ్డారు. ఆ ఫోన్ తిరిగి ఇచ్చేయమని. కానీ అతను బెదరలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇంతకీ ఆ దొంగ మన అందరికీ తెలుసు. విషయమేమిటంటే..ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ బృందావన్ దేవాలయంలో దర్శనానికి వచ్చిన ఓ భక్తుడి ఐఫోన్ చోరీ అయింది.

అయితే ఆ ఫోన్ దొంగ ఎవరో కాదు. ఒక కోతి. విలువైన ఐఫోన్ తీసుకొని ఆ కోతి తన మిత్ర బ‌ృందంతో గోడపై కూర్చుంది. ఆ ఐఫోన్ యజమాని, అతని మిత్రులు మాత్రం ఆ కోతిని భయపడించారు. కానీ ఆ కోతి ఏమీ పట్టనట్టు కూర్చొని ఉంది. చివరికి ఒక వ్యక్తి దాన్ని ప్రాధేయపడి.. ఒక అరటి పండు దాని వైపు పైకి విసిరాడు. దీంతో ఆ కోతి ఫోన్ కిందకు పడేసి.. ఆ అరటిపండుని గాల్లో క్యాచ్ పట్టుకొని పారిపోయింది. ఈ ఫన్నీ దృశ్యం ఇన్స్‌టాగ్రామ్‌లో ఒక యూజర్ పోస్ట్ చేయగా.. విపరీతంగా వైరల్ అవుతోంది.

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×