E-Paper
Advertisement

Strait of Hormuz: యుద్ధం వేళ.. భారత్‌కు ఇరాన్ గుడ్ న్యూస్.. హమ్మయ్య ప్రశాంతంగా ఉండొచ్చు!

Strait of Hormuz: యుద్ధం వేళ.. భారత్‌కు ఇరాన్ గుడ్ న్యూస్.. హమ్మయ్య ప్రశాంతంగా ఉండొచ్చు!
Advertisement

Strait of Hormuz: ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం భారత్ పై తీవ్ర ఒత్తిడిని పెంచిన సంగతి తెలిసిందే. భారత్ కు చమురు సరఫరా చేసేందుకు కీలక మార్గంగా ఉన్న హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిందన్న వార్తలు.. తీవ్ర ఆందోళనకు దారి తీశాయి. అదే నిజమైతే భారత్ కు వచ్చే చమురు నిలిచిపోయి.. దేశంలోని ఇంధన నిల్వలు అడుగుంటుతాయన్న భయాందోళనలు చెలరేగాయి. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయన్న అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేశారు. అయితే ఈ భయాలను ఇరాన్ ఒక్క ప్రకటనతో పటాపంచలు చేసింది. యుద్ధ సమయంలో భారత్ కు తీపికబురు అందించింది.

ఇరాన్ ప్రకటన ఏంటంటే?

ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRIB) తాజాగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం హర్మూజ్ జలసంధి గుండా రాకపోకలను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అయితే యుద్ధానికి కారణమైన అమెరికా, ఇజ్రాయెల్ తో పాటు యూరప్ దేశాల ఓడలకు ఈ మార్గం గుండా రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు రివల్యూషనరీ గార్డ్స్ వెల్లడించినట్లుగా ఇరాన్ రాష్ట్ర ప్రసార సంస్థ (IRIB) పేర్కొంది. దీంతో భారత్ కు చమురును మోసుకొచ్చే ఓడలు.. ఎలాంటి అడ్డంకులు లేకుండానే హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించనున్నాయి.

‘మాకు ఆ హక్కు ఉంది’

Advertisement

మరోవైపు తాజా ప్రకటనలోనే హర్మూజ్ జలసంధిపై తమకున్న నియంత్రణ గురించి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ చాటుకున్నాయి. ఆ జలసంధి గుండా ఏ ఏ దేశాల ఓడలు వెళ్లాలో నిర్ణయించే హక్కు తమకు ఉందని పేర్కొన్నాయి. ఈ విషయాన్ని తాము గతంలోనే నొక్కి చెప్పామని తెలిపాయి. అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ వాటికి మద్దతుదారులకు చెందిన ఏ నౌకలైన జలమార్గంలో కనిపిస్తే కచ్చితంగా అడ్డుకుంటామని IRGC చెప్పినట్లుగా IRIB పేర్కొంది.

Also Read: Indian Origin Murder: కెనడాలో ఘోరం.. భారత సంతతి మహిళా యూట్యూబర్‌ను.. కత్తులతో పొడిచి హత్య

చమురు ధరలపై ప్రభావం

Advertisement

ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల సైనిక చర్యలు మెుదలు కాగా.. అప్పటి నుంచి హర్మూజ్ జలసంధిలో రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో అంతర్జాతీయ చమురు ధరలపై దీని ప్రభావం స్పష్టం కనిపించింది. అయితే చైనాకు చెందిన నౌకలను మాత్రమే హర్మూజ్ జలసంధి గుండా అనుమతి ఇస్తామని ఇరాన్ మంగళవారం ప్రకటించింది. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ మినహా అన్ని దేశాల ఓడలను అనుమతిస్తామని చెప్పడం భారత్ కు ఊరటను కలిగించింది.

Also Read: BSNL Annual Plans 2026: వెరీ చీపెస్ట్ ప్లాన్స్.. రోజుకు రూ.3 ఖర్చుతో.. ఏడాదిపాటు ఫ్రీ కాల్స్, 3GB హైస్పీడ్ డేటా!

Related News

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

Big Stories

Advertisement
×