E-Paper
Advertisement

Double Decker Vande Bharat: డబుల్ డెక్కర్ వందేభారత్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!

Double Decker Vande Bharat: డబుల్ డెక్కర్ వందేభారత్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!
Advertisement

Double Decker Vande Bharat Trains: దేశంలో 15 సంవత్సరాల క్రితం డబుల్ డెక్కర్ రైలు అందుబాటులోకి వచ్చింది.  2011లో హౌరా-ధన్‌ బాద్ మధ్య మొదటి AC డబుల్ డెక్కర్ రైలును భారతీయ రైల్వే ప్రవేశపెట్టింది. 2012లో ఢిల్లీ, జైపూర్ మధ్య మరొక డబుల్ డెక్కర్ రైలు ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత బెంగళూరు- కోయంబత్తూర్, విశాఖపట్నం- విజయవాడ జంక్షన్ మధ్య ఉత్కృష్ట్ డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రి (ఉదయ్) ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లను ప్రవేశపెట్టారు. ముంబై సెంట్రల్ – అహ్మదాబాద్, చెన్నై సెంట్రల్ – బెంగళూరు,  భోపాల్-ఇండోర్ డబుల్ డెక్కర్ రైళ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

వందేభారత్ డబుల్ డెక్కర్ రైళ్లు!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 150కి పైగా వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. దాపు 600-800 కిలోమీటర్ల దూరానికి వేగవంతమైన కనెక్టివిటీని అందించేలా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. వందే భారత్ స్లీపర్ ఇప్పుడు దాదాపు 1,000 కిలోమీటర్ల సుదూర ప్రయాణాలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. భారతీయ రైల్వే ఇప్పటికే బుల్లెట్ రైలు ప్రాజెక్టులపై పని చేస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే నిపుణులు కీలక ప్రతిపాదనలు రెడీ చేశారు. ఉదయ్ ఎక్స్‌ ప్రెస్ లు లేదంటే , వందే భారత్ డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశ పెట్టాలన్నారు. వీటి వల్ల 300-400 కిలోమీటర్ల వరకు స్వల్ప దూర ప్రయాణంలో రద్దీని పెద్ద మొత్తంలో తగ్గించే అవకాశం ఉందని వెల్లడించారు. వందే భారత్ డబుల్ డెక్కర్ రైళ్లు ఇంటర్‌ సిటీ ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నారు.

ఒకేసారి ఎక్కువ మంది ప్రయాణం  

Advertisement

డబుల్ డెక్కర్ ఒక రేక్‌ కు 40–50% ఎక్కువ మంది ప్రయాణీకులను తీసుకెళ్లగలదు. అధిక డిమాండ్ ఉన్న కారిడార్లలో రద్దీని భారీగా తగ్గిస్తాయి.

పరిమిత ట్రాక్‌ల మెరుగైన ఉపయోగం

కొత్త ట్రాక్‌లను ఏర్పాటు చేయడానికి బదులుగా, డబుల్ డెక్కర్ రైళ్లు ఇప్పటికే ఉన్న రద్దీ మార్గాల్లో సామర్థ్యాన్ని పెంచుతాయి.

3–5 గంటల ప్రయాణాలకు అనుకూలంగా

Advertisement

స్లీపర్ కోచ్‌లు అవసరం లేని హై స్పీడ్ పగటి ప్రయాణానికి 300–400 కి.మీ వరకు ఈ రైళ్లు అనుకూలంగా ఉంటాయి.

విమానంలో మాదిరి సౌకర్యాలు   

ప్రీమియం సీటింగ్, ఆధునిక ఇంటీరియర్స్, వేగవంతమైన టర్నరౌండ్ సౌకర్యం సహా అచ్చం విమాన ప్రయాణం లాంటి సౌకర్యాలను పొందే అవకాశం ఉంది.

Read Also: కాశీ To అయోధ్య… IRCTC అద్భుతమైన యాత్ర ప్యాకేజీ!

తగ్గనున్న ఆపరేషనల్ ఖర్చు

రైలుకు ఎక్కువ సీట్లు ఉండడం వల్ల మెరుగైన ఆదాయ సామర్థ్యం, తక్కువ నిర్వహణ ఖర్చు అవుతుంది. ఫలితంగా ఆపరేషనల్ ఖర్చు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది.

ఎక్స్‌ ప్రెస్ రైళ్లకు తగ్గనున్న రద్దీ  

ప్రస్తుతం, ప్రజలు స్లీపర్, థర్డ్ క్లాస్ రైళ్లలోకి ఎక్కుతున్నారు. దీని కారణంగా రద్దీ ఎక్కువగా ఉంటుంది. డబుల్ డెక్కర్ రైళ్లు ప్రీమియం డే ప్రయాణికులను సెమీ హైస్పీడ్ సర్వీసులకు మార్చుతాయి. ఫలితంగా ప్రదాయ రైళ్లలో సీట్లు లభిస్తాయి.

Read Also: ఓ వందభారత్, రెండు అమృత్ భారత్ రైళ్లు, తెలుగు రాష్ట్రాలకు రైల్వే గుడ్ న్యూస్!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×