Pahalgam Terrorists : బిగ్ బ్రేకింగ్ న్యూస్. పహల్గాం ఉగ్రవాదులు శ్రీలంకకు పరారీ అయినట్టు NIA కు సమాచారం అందింది. చెన్నై నుంచి విమానంలో కొలంబో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. వెంటనే అక్కడి సిబ్బందిని భారత్ అలర్ట్ చేసింది. అనుమానిత ఉగ్రవాదుల కోసం కొలంబో విమానాశ్రయంలో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
శ్రీలంక ఎయిర్‌లైన్స్ విమానం UL 122 శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బండరానాయకే అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. వెంటనే ఎయిర్‌పోర్టును శ్రీలంక పోలీస్ సిబ్బంది చుట్టుముట్టారు. క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
భారత్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఆ విమానంలో కొలంబో వస్తున్నట్టు.. చెన్నై ఏరియా కంట్రోల్ సెంటర్ నుంచి అక్కడికి హెచ్చరిక వెళ్లిందని తెలుస్తోంది. వెంటనే స్థానిక భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని తనిఖీలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, శ్రీలంకకు వెళ్లింది పహల్గాంలో దాడి చేసిన ఆ నలుగురు ఉగ్రవాదులేనా? లేదంటే, వారికి మద్దతు ఇచ్చినట్టు భావిస్తున్న అనుమానితులా? అనేది ఇంకా కన్ఫామ్ కావాల్సి ఉంది.