BigTV English

Vaibhav Suryavanshi : ఒరేయ్… రియాన్ పరాగ్ కొడుకే వైభవ్ సూర్య వంశీ.. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్

Vaibhav Suryavanshi : ఒరేయ్… రియాన్ పరాగ్ కొడుకే వైభవ్ సూర్య వంశీ.. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్

Vaibhav Suryavanshi : రియాన్ పరాగ్ ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఆర్.ఆర్.కెప్టెన్ సంజు శాంసన్ గాయం కారణంగా వైస్ కెప్టెన్ గా ఉన్నటువంటి పరాగ్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 11 మ్యాచ్ లు ఆడి కేవలం 3 మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించింది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో అయితే 100 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది రాజస్థాన్ జట్టు. దీంతో ముంబై కి ప్లస్ పాయింట్ అయింది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.


Also Read : Nitish Kumar Reddy : కొడుకు SRH… తండ్రి RCB… ఫ్యాన్స్ ను పిచ్చోళ్ళు చేస్తున్నారు కదరా

ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ కొడుకే యంగ్ బ్యాట్స్ మెన్ వైభవ్ సూర్యవంశీ అని ట్రోలింగ్స్ చేస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ కి సంబంధించిన ఓ ఫొటోకు మీసాలు, గడ్డం పెడితే.. రియాన్ పరాగ్ మాదిరిగా క్రియేట్ చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం ట్రోలింగ్స్ కి గురవుతుంది. వైభవ్ సూర్యవంశీ గుజరాత్ టైటాన్స్ పై 35 బంతుల్లోనే సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అదే ముంబై ఇండియన్స్ మాత్రం డకౌట్ కావడం విశేషం. కొందరూ సరైన బౌలింగ్ వేస్తే.. వైభవ్ వెంటనే ఔట్ అవుతాడని.. మొన్న భువనేశ్వర్ వేసిన యార్కర్ కి క్లీన్ బౌల్డ్ అయ్యాడని.. అలాగే దీపక్ చాహర్ వేసిన బంతికి డకౌట్ అయ్యాడని పేర్కొంటున్నారు.


ముఖ్యంగా ఐపీఎల్ లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా, అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారతీయుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. అతని ఆటతో పాటు.. అతని వయస్సు కూడా ప్రశ్నార్థకంగా మారింది. భారత మాజీ బాక్సర్ విజేందర్ సింగ్ వైభవ్ సూర్యవంశీ వయస్సు పై ప్రశ్నలు లేవనెత్తారు. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి వైభవ్ సూర్యవంశీ వయస్సు గురించి కీలక వాదన చేశాడు. వైభవ్ సూర్యవంశీ వయస్సు 16 సంవత్సరాలు అని చెబుతున్నారు. వైభవ్ అసలు వయస్సు 16 సంవత్సరాలు అని.. బీహార్ లోని సమస్తిపూర్ నివాసితులమని వీడియోలో వెల్లడించారు. వైభవ్ తండ్రి రోజూ వైభవ్ ను పాట్నాకు తీసుకెల్లేవాడని. మేము వైభవ్ కి నెట్స్ లో బౌలింగ్ చేసేవాళ్లమని తెలిపారు. బీహార్ కి చెందిన అబ్బాయి ఫేమస్ అవుతున్నాడని గర్వపడుతున్నానని.. కానీ వయస్సు మాత్రం 14 సంవత్సరాలు అని చూపిస్తున్నందుకు బాధగా ఉందని తెలిపాడు.

వైభవ్ సూర్యవంశీ ఆరు సంవత్సరాల వయస్సులోని క్రికెట్ స్టేడియానికి వెళ్లడం ప్రారంభించాడట. తన కుటుంబ సభ్యులతో కలిసి నిత్యం ఐపీఎల్ మ్యాచ్ లు చూసేవాడట. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అతని ఆటను ఆస్వాదిస్తున్నారు. మొన్న గుజరాత్ టైటాన్స్ జరిగిన మ్యాచ్ లో అతను కొట్టిన సిక్సర్లు సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం. ఇక వైభవ్ ఆడే రాజస్థాన్ రాయల్స్  జ‌ట్టు ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. నెట్‌ర‌న్‌రేట్ -0.780గా ఉంది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో 8 స్థానంలో ఉంది. ఈ సీజ‌న్‌లో మ‌రో మూడు మ్యాచ్‌లు ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌ల్లోనైనా గెలిచి పాయింట్ల ప‌ట్టిక‌లో కాస్త‌మెరుగైన స్థానంతో సీజ‌న్‌ను ముగించాల‌ని రాజ‌స్థాన్ భావిస్తోంది.

?igsh=MWdkOHd2dnR5MXc3dA==

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×