BigTV English

SamsungGalaxyF06: బెస్ట్ డీల్..రూ. 7,999కే సామ్ సామ్‌సంగ్ గెలాక్సీ 5G స్మార్ట్‌ఫోన్‌

SamsungGalaxyF06: బెస్ట్ డీల్..రూ. 7,999కే సామ్ సామ్‌సంగ్ గెలాక్సీ 5G స్మార్ట్‌ఫోన్‌

SamsungGalaxyF06: ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరూ కూడా 5G ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే సామాన్య వినియోగదారుల కోసం ప్రముఖ బ్రాండ్ Samsung 10 వేల రూపాయల లోపే 5జీ ఫోన్ అనౌన్స్ చేసింది. స్టైల్, స్పీడ్ సహా అన్ని కలిసిన Samsung Galaxy F06 5G ఇప్పుడు అద్భుతమైన ఫీచర్లతో అత్యంత తక్కువ ధరకు మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


డిజైన్ & డిస్‌ప్లే
స్టైలిష్ లుక్‌తో Galaxy F06 5G ఫోన్ “Ripple Glow” అనే ప్రత్యేకమైన ఫినిషింగ్‌తో వస్తోంది. ఇది చేతిలో పట్టుకున్నప్పుడు ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. ఈ ఫోన్ 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ బ్రైట్‌నెస్ 800 నిట్స్ వరకు ఉండటంతో, ఎండలోనూ క్లారిటీతో చూస్తూ పనిచేయవచ్చు. అంతేకాదు, 90Hz Refresh Rate కూడా ఉన్నందున స్క్రోలింగ్, యాప్ ట్రాన్సిషన్లు చాలా స్మూత్‌గా అనిపిస్తాయి.

కెమెరా
క్లారిటీ సెల్ఫీలు, ఫోటోగ్రఫీ ప్రేమికుల కోసం Galaxy F06 5G డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తోంది. ప్రధాన కెమెరా 50MP, దీనితో మీరు క్లియర్ ఫోటోలు తీసుకోవచ్చు. అదనంగా 2MP డెప్త్ సెన్సార్ కూడా ఉంది. ఇది బోకె ఎఫెక్ట్ ఉన్న పోర్ట్రెయిట్ షాట్స్ తీసేందుకు ఉపయోగపడుతుంది. ఫ్రంట్‌లో 8MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది వీడియో కాల్స్‌కి, సోషల్ మీడియా కోసం చక్కగా ఉపయోగపడుతుంది.


ప్రాసెసర్‌
-ఈ ఫోన్‌లో MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ఉంది. ఇది సాధారణంగా మిడ్ రేంజ్ ఫోన్లలో కనిపించే శక్తివంతమైన చిప్. ఇది 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. మీకు ఇంకా ఎక్కువ స్టోరేజ్ అవసరమైతే, 1TB వరకు మైక్రోSD కార్డ్ పెంచుకోవచ్చు. ఈ ఫోన్ Android 15 ఆధారిత One UI 7.0పై రన్ అవుతుంది.

Read Also: Realme C75 5G: తక్కువ ధరకే 6000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌..

బ్యాటరీ & ఛార్జింగ్
Galaxy F06 5G ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది. రెగ్యులర్ వాడకానికి రెండు రోజులపాటు ఇస్తుంది. దీంతో పాటు 25W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అందుబాటులో ఉంది. అంటే, ఛార్జింగ్‌లో సమయం వృథా చేయాల్సిన అవసరం లేదు.

భద్రతా లక్షణాలు (SamsungGalaxyF06)
సాధారణంగా బడ్జెట్ ఫోన్లలో భద్రతా ఫీచర్లు తక్కువగా ఉండే ఛాన్సుంది. కానీ Samsung Galaxy F06 5Gలో Samsung Knox Vault ఉంది. ఇది హార్డ్‌వేర్ స్థాయిని భద్రతను అందిస్తుంది. పాస్ వర్డ్, ఫింగర్ ప్రింట్ డేటా లాంటి సున్నితమైన సమాచారం ప్రొటెక్ట్ చేయబడుతుంది. అదనంగా Voice Focus ఫీచర్ మీ వాయిస్‌ను క్లియర్‌గా రిసీవర్‌కి పంపుతుంది. శబ్దభరిత ప్రదేశాల్లో కూడా స్పష్టమైన కాల్స్‌కి ఇది ఉపయోగపడుతుంది. Quick Share ద్వారా ఫైళ్లను వేగంగా షేర్ చేసుకోవచ్చు.

కలర్ వేరియంట్లు & లభ్యత
Samsung Galaxy F06 5G రెండు ఆకర్షణీయమైన రంగుల్లో వస్తోంది:
-బహామా బ్లూ
-లిట్ వైలెట్
ఇలాంటి ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ అసలు ధర రూ. 12,499 కాగా, ప్రస్తుతం ఇది రూ. 7,999కే ఫ్లిప్ కార్టులో అందుబాటులో ఉంది. అంటే సమ్మర్ సేల్ సందర్భంగా 36% తగ్గింపు లభిస్తోంది. తక్కువ బడ్జెట్‌తో 5G టెక్నాలజీ ఫోన్ కావాలనున్న వారిసి ఇది బెస్ట్ చాయిస్.

Related News

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls| స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Big Stories

×