BigTV English
Advertisement

CBI : కర్ణాటక డీజీపీకి ప్రమోషన్.. సీబీఐ కొత్త డైరెక్టర్ గా ఎంపిక.. అందుకేనా..?

CBI : కర్ణాటక డీజీపీకి ప్రమోషన్.. సీబీఐ కొత్త డైరెక్టర్ గా ఎంపిక.. అందుకేనా..?


CBI : సీబీఐ కొత్త డైరెక్టర్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ ప్రవీణ్‌ సూద్‌ ఎంపికయ్యారు. ప్రధాని, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ ప్రతిపక్ష నేతతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ఆయనను సీబీఐ డైరెక్టర్ గా ఎంపిక చేసింది. ప్రవీణ్‌ సూద్‌ రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే పదవీ కాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం కూడా ఉంది.

ప్రవీణ్ సూద్ 1986 బ్యాచ్‌ కర్ణాటక క్యాడర్‌ ఐపీఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం కర్ణాటక డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సీబీఐ డైరెక్టర్‌ సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్‌ పదవీకాలం మే 25న ముగుస్తుంది.
రెండేళ్లుగా జైస్వాల్ ఈ పదవిలో ఉన్నారు.


ప్రధాని, సీజేఐ, లోక్‌సభ ప్రతిపక్ష నేతతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ శనివారం సమావేశమైంది. సీబీఐ కొత్త డైరెక్టర్‌ నియామకానికి ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల పేర్లను పరిశీలించింది. కర్ణాటక డీజీపీ ప్రవీణ్‌ సూద్‌, మధ్యప్రదేశ్‌ డీజీపీ సుధీర్‌ సక్సేనా, తాజ్‌ హసన్‌ల పేర్లు పరిశీలించనట్లు తెలుస్తోంది. అయితే కర్ణాటక డీజీపీ ప్రవీణ్‌ సూద్‌ సీబీఐ నూతన డైరెక్టర్‌గా ఎంపిక చేసింది.

కర్ణాటక ఎన్నికల సమయంలో డీజీపీ ప్రవీణ్ సూద్ వ్యవహారం వివాదంగా మారింది. తమ పార్టీ నేతలపై ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేస్తున్నారని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ కు మద్దతుగా పని చేస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీకి వంతపాడుతున్న డీజీపీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డీజీపీపై చర్యలు తీసుకుంటామని డీకే శివకుమార్ హెచ్చరించారు.

డీకే శివకుమార్ చెప్పినట్లుగా కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రోజే సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్‌ సూద్‌ ఎంపికయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోకముందే కేంద్రం ప్రవీణ్ సూద్ కు సీబీఐ డైరెక్టర్ గా ప్రమోషన్ ఇచ్చింది. మరి హస్తం నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×