BigTV English

Karnataka Elections : భజరంగ్ దళ్ బ్యాన్ వివాదం .. హనుమాన్ చాలీసా పఠనం.. హీటెక్కిన పాలిటిక్స్..

Karnataka Elections : భజరంగ్ దళ్ బ్యాన్ వివాదం .. హనుమాన్ చాలీసా పఠనం.. హీటెక్కిన పాలిటిక్స్..

Karnataka Elections(Political News in India) : కన్నడ పాలిటిక్స్ పీక్ స్టేజ్‌కు చేరాయి. ఇప్పటికే ఆరోపణలు, ప్రత్యారోపణలతో దుమ్మెత్తిపోసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొత్త వివాదం చిచ్చు రేపింది. తాము అధికారంలోకి వస్తే భజ్‌రంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామని మేనిఫెస్టోలో చేర్చింది కాంగ్రెస్. ఇప్పుడు ఇదే అంశం కర్ణాటక రాజకీయాలను షేక్ చేస్తోంది.


కాంగ్రెస్ నిర్ణయాన్ని హిందుత్వ సంస్థలు తప్పుపడుతున్నాయి.దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడింది బీజేపీ. కాంగ్రెస్‌ను హిందూ వ్యతిరేకిగా చూపించి.. ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా కాషాయ పార్టీ హనుమాన్ చాలీసా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. భజ్‌రంగ్ దళ్‌ బ్యాన్ నిర్ణయానికి వ్యతిరేకంగా గురువారం రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో హనుమాన్ చాలీసా పఠించాలని కాషాయ నేతలు పిలుపునిచ్చారు. సాయంత్రం 7 గంటలకు అన్ని ఆలయాల్లో హనుమాన్ చాలీసా పఠించాలని కేంద్రమంత్రి శోభా కరంద్లాజె కోరారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే కాంగ్రెస్ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. బీజేపీ నిర్ణయంతో కర్నాటకలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఇటీవలే కర్ణాటక ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భజరంగ్ దళ్, PFI లాంటి సంస్థలను బ్యాన్ చేస్తామని స్పష్టం చేసింది. ఈ సంస్థలు సమాజంలో విద్వేషాలు రెచ్చ గొడుతున్నాయని ఆరోపించింది. అందుకే వాటిపై నిషేధం విధిస్తామని వెల్లడించింది. దీంతో కాంగ్రెస్ మేనిఫెస్టోను తగలబెడుతూ పలు హిందుత్వ సంస్థలు ఆందోళనలు చేపడుతున్నాయి.


అంతుకుముందు మేనిఫెస్టోను విడుదల చేసిన బీజేపీ రాష్ట్రంలో ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించింది. దీని కౌంటర్ గానే కాంగ్రెస్ తన మేనిఫెస్టో లో భజ్ రంగ్ దళ బ్యాన్ అంశాన్ని చేర్చింది. దీంతో కర్ణాటకలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.

Related News

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Big Stories

×