E-Paper
Advertisement

Bangalore Politics: ఆసక్తిగా కర్ణాటక రాజకీయాలు.. అధికార మార్పిడి వ్యవహారం, ఢిల్లీలో నేతలు మకాం

Bangalore Politics: ఆసక్తిగా కర్ణాటక రాజకీయాలు.. అధికార మార్పిడి వ్యవహారం, ఢిల్లీలో నేతలు మకాం
Advertisement

Bangalore Politics: కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కార్ ఏర్పడి రెండున్నరేళ్లు గడిచింది. దీంతో అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా వీడెక్కాయి. ఓవైపు మంత్రి వర్గం పునర్ వ్యవస్థీకరణ.. మరోవైపు అధికారం మార్పడి వ్యవహారాలపై కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో సిద్ధరామయ్య- డీకె శివకుమార్ వర్గీయులు ఢిల్లీలో మకాం వేశారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ హైకమాండ్ అయోమయంలో ఉన్నట్లు తెలుస్తోంది.

కర్ణాటక పాలక పక్షంలో వేడెక్కిన రాజకీయాలు

Advertisement

సిద్ధరామయ్య ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో అధికార మార్పిడి రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సీఎం అయ్యేందుకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తన నివాసంలో రహస్య సమావేశం నిర్వహిస్తున్నారు. అటు సిద్ధరామయ్య సన్నిహితులు విందు సమావేశాన్ని రూపొందిస్తున్నారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందోనన్న చర్చ అప్పుడే మొదలైంది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది కాంగ్రెస్‌. ఆనాటి రెండున్నరేళ్ల తర్వాత అధికార మార్పిడి ఉంటుందని అప్పుడు జోరుగా ప్రచారం సాగింది. గురువారంతో సిద్ధరామయ్య సర్కారుకు రెండున్నరేళ్లు పూర్తి  చేసుకుంది. బీహార్‌ ఎన్నికల ఫలితాల మరుసటి రోజు సీఎం సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లారు.

Advertisement

అధికార మార్పిడి కోసం డీకే వర్గీయులు  ఢిల్లీలో మకాం

పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఇవ్వాలని కోరారు. మంత్రివర్గ విస్తరణకు అవకాశమిస్తే మరో ఏడాది పాటు తన పదవికి ఢోకా ఉండదన్న అంచనాతో సిద్ధరామయ్య ఈ ప్రతిపాదన చేసినట్టు ఒక్కసారిగా వార్తలు జోరందుకున్నాయి. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.

సీఎం సిద్ధరామయ్య తీరుపై అసహనంతో ఉన్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ తన మద్దతుదారులతో తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ కోసం ఎంతో శ్రమించిన డీకే, ముఖ్యమంత్రి పదవికి అర్హుడని కొందరు మంత్రులు చెబుతున్నారు. ఢిల్లీలోని డీకే వర్గానికి చెందిన మంత్రి శివానంద్ పాటిల్, ఎమ్మెల్యేలు శివన్న, శ్రీనివాస్, రంగనాథ్, రవిగణిగ, రాజేగౌడ ఢిల్లీకి వెళ్లారు.

ALSO READ: శబరిమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఇక స్పాట్ బుకింగ్ ఐదువేలే

హైకమాండ్ వద్ద డీకేకు అనుకూలంగా వాదనలు వినిపించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటులో కుదిరిన ఒప్పందం మేరకు డీకే శివకుమార్‌కు అధికారం అప్పగించాలని వివరించారట. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో డీకే కీలక పాత్ర పోషించారని, ఇప్పటివరకు ప్రభుత్వానికి ఎలాంటి నష్టం కలిగించలేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గేతో అన్నట్లు కర్ణాటక కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు శివకుమార్‌ సోదరుడు, మాజీ ఎంపీ సురేశ్‌ మాత్రం, సీఎం సిద్ధరామయ్య ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని తాము భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. డీకే మద్దతుదారులు ఢిల్లీకి వెళ్లడంతో సీఎం సిద్ధరామయ్య సన్నిహితులు విందు రాజకీయాలు మొదలుపెట్టారు. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొందరు ఎంపీలు హాజరైనట్టు చెబుతున్నారు. సిద్ధరామయ్యను పదవిలో కొనసాగేలా హైకమాండ్‌పై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. మొత్తానికి రానున్న రోజుల్లో కర్ణాటక రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×