E-Paper
Advertisement

Kejriwal Petition Dismissed: ఆప్ అధినేతకు చుక్కెదురు.. కేజ్రీవాల్‌‌ పిటిషన్ తిరస్కరణ..!

Kejriwal Petition Dismissed: ఆప్ అధినేతకు చుక్కెదురు.. కేజ్రీవాల్‌‌ పిటిషన్ తిరస్కరణ..!
Kejriwal Verdict By Delhi High Court in Liquor Scam
Kejriwal Verdict By Delhi High Court in Liquor Scam

CM Arvind Kejriwal Petition Dismissed By Delhi High Court in Liquor Scam: అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడానికి ఈడీ వద్ద తగినంత ఆధారం ఉందని మంగళవారం కోర్టు స్పష్టం చేసింది. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.

కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడానికి దారితీసిన తగినంత మెటీరియల్‌ ఈడీ వద్ద ఉందని.. కేజ్రీవాల్‌ విచారణకు హాజరుకాకపోవడం.. ఆయన వల్ల జరిగిన జాప్యం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నవారిపై కూడా ప్రభావం చూపిందని ఢిల్లీ హైకోర్టు ఆప్ అధినేత అరెస్టు ఆవశ్యకతపై మంగళవారం తీర్పునిచ్చింది.

ఢిల్లీ హైకోర్టు రాజ్యాంగ నైతికతకు కట్టుబడి ఉంటుందని.. రాజకీయ నైతికతకు కాదని స్పష్టం చేసింది. కోర్టు రాజకీయాల జోలికి వెళ్లదని పేర్కొంది. అరెస్టు సమయాన్ని ఈడీ నిర్ణయించినట్లు తాను భావించలేమని.. నిందితుల అరెస్ట్ చట్ట ప్రకారం పరిశీలించాల్సి ఉంటుందని.. ఎన్నికల సమయం ప్రకారం కాదని స్పష్టం చేసింది.

Also Read: Court dismisses Kejriwal petition: కేజ్రీవాల్‌కు మరో షాక్, ఇక సుప్రీంకోర్టుకు..

కోర్టు వివిధ కేటగిరీలకు చట్టాలు రూపొందించదని.. చట్టం అందరికీ ఒకే లా ఉంటుందని.. సీఎంగా తనకు ఎలాంటి ఇమ్యూనిటీ లేదని స్పష్టం చేసింది.

అరవింద్ కేజ్రీవాల్‌ను జ్యుడీషియల్ కస్టడీకి పంపిన ఉత్తర్వుతో సహా ట్రయల్ కోర్టు రిమాండ్ ఉత్తర్వులను కూడా జస్టిస్ స్వర్ణ కాంత శర్మ సమర్థించారు.

లిక్కర్ పాలసి రూపకల్పన, మనీలాండరింగ్ వ్యవహారంలో కేజ్రీవాల్ పాత్ర ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ముడుపులు తీసుకోవడంలో కేజ్రీవాల్ పాత్ర ఉందని పేర్కొంది.

తమ ముందున్న అంశం కేజ్రీవాల్, దర్యాప్తు సంస్థ ఈడీ మధ్య అని.. కేంద్ర ప్రభుత్వానికి, కేజ్రీవాల్ మధ్య వివాదం కాదని కోర్టు పేర్కొంది.

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×