BigTV English

Niharika Konidela’s Committee Kurrallu: కమిటీ కుర్రాళ్లతో మెగా డాటర్ కు ఏం పని..?

Niharika Konidela’s Committee Kurrallu: కమిటీ కుర్రాళ్లతో మెగా డాటర్ కు ఏం పని..?
Niharika Konidela's Committee Kurrallu:
Niharika Konidela’s Committee Kurrallu:

Niharika Konidela’s Committee Kurrallu: మెగా డాటర్ నిహారిక గుణదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ అంటే నిహారిక పేరే చెప్పుకోవచ్చు. ఒక మనసు సినిమాతో ఆమె టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించ లేనప్పటికీ నిహారికకు మంచి అవకాశాల్ని తీసుకొచ్చి పెట్టింది. కానీ ఆమెకు విజయాలు మాత్రం దక్కలేదు. దీంతో ఆమె సినిమాలకు దూరమై పెద్దలు కుదిరించిన వివాహాన్ని చేసుకుంది.


చైతన్య జొన్నలగడ్డతో ఆమె వివాహం ఉదయపూర్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే కొన్ని విభేదాలు వలన ఈ జంట మూడేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఇక విడాకుల అనంతరం నిహారిక మరోసారి తన సత్తా నిరూపించడానికి కష్టపడుతుంది. డెడ్ పిక్సెల్ అనే వెబ్ సిరీస్ తో ఓటీటిలోకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. ప్రస్తుతం నటిగా, నిర్మాతగా మారి సినిమాలు చేస్తుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా ఒక సినిమాను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఎంతో గ్రాండ్ గా జరిగాయి.

Also Read: The Goat Life: రూ.100 కోట్లు రాబట్టిన లేటెస్ట్ మూవీ.. ఆ పాత్ర కోసం 15 రోజులు ఆహారం లేకుండా..!


యాదు వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కొత్త నటీనటులు పరిచయం కానున్నారు. తాజాగా నేడు ఉగాది పండగ సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు కమిటీ కుర్రాళ్లు అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలిపారు. గోదారి యాస, గోదారి ఎటకారమే కాదండి. గోదారి కుర్రోళ్లతో కూడా మామూలుగా ఉండదు మరి అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో నిహారిక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×