BigTV English

Oommen Chandy: కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ కన్నుమూత..

Oommen Chandy: కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ కన్నుమూత..

Oommen Chandy death news(Telugu news headlines today): కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఊమెన్‌ చాందీ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చాందీ బెంగళూరులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ప్రకటించారు. గతంలో గొంతు సమస్యలతో చాందీ హాస్పటల్ చేరి చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ హాస్పటల్ లో చేరారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.


కేరళలోని కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్ గ్రామంలో 1943 అక్టోబర్ 31న ఊమెన్‌ చాందీ జన్మించారు. సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించారు. ఎంతో కష్టపడి పనిచేసి పార్టీ అధిష్టానాన్ని మెప్పించారు. 27 ఏళ్లకే పూతుపల్లి నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచారు. అలా 1970 ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత అదే నియోజకవర్గం పోటీ చేస్తూ వచ్చారు. ఇలా 12 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

ఊమెన్ చాందీ 1977లో కె.కరుణాకరన్‌ కేబినెట్‌లో తొలిసారిగా మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ఆ తర్వాత కేరళ సీఎం పదవిని చేపట్టారు. 2004- 2006, 2011- 2016లో రెండుసార్లు సీఎం బాధ్యతలను నిర్వహించారు.


ఊమెన్ చాందీ 5 దశాబ్దాల రాజకీయ జీవితం కాంగ్రెస్ తోనే సాగింది. ఆయన ఎప్పుడూ మరో పార్టీ వంక చూడలేదు. కాంగ్రెస్ కు విశ్వాసపాత్రుడిగానే ఉండిపోయారు. ఈ అంశాలే ఆయనను కేరళకు రెండుసార్లు సీఎం అయ్యే అవకాశం కల్పించాయి.

Related News

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

Big Stories

×