BigTV English

Congress: సోనియా ఇంటికి రైతులు.. కలిసి భోజనం, డ్యాన్సులు.. మార్పు మంచికే..

Congress: సోనియా ఇంటికి రైతులు.. కలిసి భోజనం, డ్యాన్సులు.. మార్పు మంచికే..
sonia gandhi dance

Sonia Gandhi news today(Latest congress news in India): గాంధీ కుటుంబం. ప్రాణాలకు ముప్పు ఉండటంతో.. దశాబ్దాల తరబడి NSG రక్షణలోనే ఉండిపోయారు. నిత్యం గన్‌మెన్ల పహారాలోనే. ఎక్కడికి వెళ్లినా అత్యంత టైట్ సెక్యూరిటీ. కనీసం ప్రజలకు సమీపంగా కూడా వెళ్లనిచ్చేవారు కాదు. దీంతో గాంధీ ఫ్యామిలీకి.. పబ్లిక్‌కు మధ్య ఓ గ్యాప్ ఎప్పుడూ ఉంటూనే ఉండేది. భారత్ జోడో యాత్రతో ఆ రేఖను తుడిచేశారు రాహుల్‌గాంధీ. సెక్యూరిటీ ప్రోటోకాల్ ఫాలో అవుతూనే.. దేశప్రజలకు అత్యంత చేరువయ్యారు. ఈ మార్పు కాంగ్రెస్ పార్టీని ప్రజలకు మరింత దగ్గర చేసింది. అది మరింత కంటిన్యూ చేస్తూ.. రాహుల్ ఆకస్మిక పర్యటనలతో జనం హృదయాల్లోకి చొచ్చుకెళుతున్నారు. తనతో పాటు పార్టీని ప్రజలకు కొత్తగా పరిచయం చేస్తున్నారు. మార్పు మంచిదే అన్నట్టు.. లేటెస్ట్‌గా సోనియాగాంధీ సైతం సాధారణ రైతులతో కలిసిపోయారు. ఏకంగా సోనియా ఇంటికే ఆ మహిళలు అతిథిలుగా వచ్చారు. గాంధీ ఫ్యామిలీతో కులాసాగా గడిపారు. కలిసి భోజనం చేశారు. కలిసి డ్యాన్సులు కూడా చేశారు. ఈ దృశ్యం.. నెవ్వర్ బిఫోర్. ఈ క్రెడిట్ మొత్తం రాహుల్‌గాంధీకే.


ఇటీవల హర్యానాలో పర్యటించారు రాహుల్‌ గాంధీ. ఆసమయంలో మహిళా రైతులతో కలిసి వరినాట్లు వేసిన రాహుల్.. వారితో చాలాసేపు ముచ్చటించారు. వారి కష్టసుఖాలతో పాటు కోరికలను తెలుసుకున్నారు. ఆ సందర్భంలో ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటిని చూడాలని ఉందంటూ మహిళా రైతులు తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. అయితే, తన ఇంటిని ప్రభుత్వం తీసేసుకుందని చెప్పిన రాహుల్.. తన తల్లి సోనియా గాంధీ ఇంటికి వారిని ఆహ్వానించారు.

జస్ట్ పిలవడమే కాదు.. వారి కోసం ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశారు. హర్యానాలోని సోనిపట్ నుంచి ఢిల్లీకి ఆ మహిళా రైతులను తీసుకొచ్చారు. సోనియా నివాసంలో గాంధీ కుటుంబంతో మమేకమయ్యారు. ప్రియాంక, రాహుల్, సోనియాలతో కలిసి భోజనం చేశారు. వారి కష్టసుఖాలు చెప్పుకున్నారు. భోజనం తర్వాత గార్డెన్‌లో.. ఆ మహిళా రైతులతో కలిసి డ్యాన్స్ చేశారు సోనియా, ప్రియాంక. ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది కాంగ్రెస్.


Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×