E-Paper
Advertisement

Kim : క్షిపణితో న్యూ ఇయర్ కు వెల్ కమ్.. అణ్వస్త్రాల తయారీని పెంచుతాం: కిమ్

Kim : క్షిపణితో న్యూ ఇయర్ కు వెల్ కమ్.. అణ్వస్త్రాల తయారీని పెంచుతాం: కిమ్
Advertisement

Kim : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ రూటే సెపరేటు. ప్రపంచమంతా బాణాసంచా వెలుగుల్లో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించింది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ మాత్రం క్షిపణి ప్రయోగంతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టారు. 2022లో రికార్డు స్థాయిలో ఆయుధ ప్రయోగ పరీక్షలు ఉత్తర కొరియా నిర్వహించింది. ఆదివారం కూడా తూర్పు జలాల్లోకి ఓ బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. ఈ ఏడాది కూడా ఆయుధ పరీక్షలు భారీగానే చేస్తామని కిమ్ సంకేతాలిచ్చారు.

కొత్త రకం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని తయారు చేయాలని అధికారులను కిమ్ ఆదేశించినట్లు ఆ దేశ అధికారిక మీడియా కేసీఎన్‌ఏ ప్రకటించింది. అలాగే తొలి మిలిటరీ ‘గూఢచార ఉపగ్రహాన్ని సైతం త్వరలో ప్రయోగించాలని యోచిస్తున్నట్లు కిమ్ తెలిపారు. శనివారం కూడా ఉత్తర కొరియా మూడు స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ మిస్సైళ్లను తూర్పు జలాల్లోకి ప్రయోగించింది. ఉత్తర ప్రాంతంపై అంతరిక్షం నుంచి నిఘా సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు దక్షిణ కొరియా ఘన ఇంధన రాకెట్‌ను ప్రయోగించిన తర్వాత రోజే ఉత్తర కొరియా క్షిపణులను ప్రయోగించడం రెండుదేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది.

Advertisement

కొత్త సంవత్సరం సందర్భంగా అధికార పార్టీ సమావేశంలో పాల్గొన్న కిమ్ అణ్వస్త్రాల తయారీని గణనీయంగా పెంచుతామని ప్రతిజ్ఞ చేశారు. మరింత శక్తిమంతమైన ఖండాంతర క్షిపణులను తయారు చేస్తామని ప్రకటించారు. అమెరికా సహా ఇతర ప్రత్యర్థి దేశాలను ఎదుర్కొనేందుకు సైనిక శక్తిని పటిష్ఠ చేస్తామన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వ్యూహాత్మక అణ్వస్త్రాల తయారీ గణనీయంగా పెంచాల్సిన పరిస్థితులు సృష్టిస్తున్నారని పరోక్షంగా అమెరికా, దక్షిణ కొరియాలను కిమ్ విమర్శించారు.

ఉత్తర కొరియా తాజా క్షిపణి ప్రయోగాలను దక్షిణ కొరియా, అమెరికా ఇండో- పసిఫిక్‌ కమాండ్‌ తీవ్రంగా ఖండించాయి. ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు దిగుతోందని దక్షిణ కొరియా ‘జాయింట్‌ ఛీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌’ అన్నారు. కొరియా ద్వీపకల్ప శాంతి భద్రతలకు ఇది విఘాతం కల్గించే చర్య అని అన్నారు. అమెరికాతో కలిసి ఉత్తర కొరియా చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చట్టవిరుద్ధమైన ఆయుధ కార్యకలాపాల ద్వారా ఉత్తర కొరియా అస్థిర పరిస్థితులకు దారితీస్తోందని అమెరికా ఇండో-పసిఫిక్‌ కమాండ్‌ తెలిపింది. దక్షిణ కొరియా, జపాన్‌ను రక్షించేందుకు అమెరికా కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.

Related News

‘చిన్నారిని బెదిరిస్తే చూస్తూ ఊరుకోం’.. ఇన్‌ఫ్లుయెన్సర్ వేధింపులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఉత్కంఠకు చెక్.. భారత్‌లో చైనా అధ్యక్షుడి పర్యటన ఖరారు.. బ్రిక్స్ సదస్సుకు హాజరు

గుజరాత్ ఒమ్ని vs ఇటలీ బార్.. 80s ఏఐ ట్రెండ్‌తో.. రచ్చకెక్కిన బీజేపీ, కాంగ్రెస్!

సీఎం విజయ్‌కు స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్.. అవును విజయ్.. నా దవడ విరిగింది?

జంతర్ మంతర్ కేసులను రద్దు చేసినా నోటీసులా.. సుప్రీం కోర్టు ఫైర్!

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అలాంటి వీడియోలు.. 63 మందిపై కేసు నమోదు!

పెళ్లి తర్వాత కూడా మహిళల సమ్మతి ముఖ్యమే.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం!

తెలుగు రాష్ట్రాలకు రైల్వే నిధుల పండుగ.. విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లకు గుడ్ న్యూస్!

Big Stories

Advertisement
×