BigTV English
Advertisement

Newborn Hurled: శిశువును రోడ్డుపై విసిరేసిన యువతి.. నిందితురాలిని పట్టించిన పార్శిల్ కవర్!

Newborn Hurled: శిశువును రోడ్డుపై విసిరేసిన యువతి.. నిందితురాలిని పట్టించిన పార్శిల్ కవర్!

Newborn Hurled Outside: ఆ పసికందు కళ్లు తెరిచి కొద్దిసేపు కూడా కాలేదు. ఆ శిశువు ఈ లోకానికి రావడానికి కారణమైన తన తల్లే ఆ పసికందు మృతికి కారణమయ్యింది. ఆపై తాననెవరూ గుర్తుపట్టరనుకుంది. కానీ, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేరళ రాష్ట్రంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఎంబీఏ చదువుతున్న ఓ యువతి తెల్లవారు జామున బాత్రూమ్ లో ఓ పసికందుకు జన్మనిచ్చింది. విషయం తన తల్లిదండ్రులకు తెలవొద్దని జన్మనిచ్చిన పసికందును పార్శిల్ కవర్ లో చుట్టి బాల్కానీ నుంచి పడేసి తాను ఇక ఎవరికి దొరకననుకున్నది. కానీ, పార్శిల్ కవర్ ఆమెను పోలీసులకు పట్టిచ్చింది.


ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొచ్చిన్ కు చెందిన 24 ఏళ్లు ఉన్న ఓ ఎంబీఏ విద్యార్థిని శుక్రవారం ఉదయం బూత్రూమ్ లో ఓ శిశువుకు జన్మనిచ్చింది. అయితే, ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలియకూడదని ఆమెజాన్ పార్శిల్ కవర్ లో ఆ శిశువును చుట్టింది. ఆ తరువాత అపార్ట్ మెంటు బాల్కనీ నుంచి బయటకు విసిరేసింది. దీంతో పార్శిల్ కవర్ లోని శిశువు ప్రాణాలు కోల్పోయింది.

Also Read: గుజరాత్‌లో దారుణం, ప్రియురాలి కోసం పార్సిల్ బాంబ్.. ఏం జరిగిందంటే..


అయితే, అటువైపుగా పనిచేస్తున్నటువంటి కొంతమంది పారిశుద్ధ్య కార్మికులు ఆ పార్శిల్ కవర్ లోని శిశువును గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. పార్శిల్ కవర్ పై ఉన్న అడ్రస్ ఆధారంగా ఆ యువతిని గుర్తించగలిగారు.

Tags

Related News

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Delhi Politics: ఓట్‌ చోరీపై కొత్త బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ.. బ్రెజిల్‌ మోడల్‌‌కు ఓటు హక్కు, హవ్వా

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Muzaffarnagar: కళాశాల విద్యార్థినులకు వేధింపులు.. యూపీ పోలీసుల స్పెషల్ ట్రీట్‌మెంట్

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు

Big Stories

×