E-Paper
Advertisement

LPG Cylinder New Rules: గ్యాస్ వినియోగదారులకు సూచన.. మే 1 నుంచి కొత్త రూల్స్ మొదలు, బుకింగ్ టైమ్ కూడా

LPG Cylinder New Rules: గ్యాస్ వినియోగదారులకు సూచన.. మే 1 నుంచి   కొత్త రూల్స్ మొదలు, బుకింగ్ టైమ్ కూడా
Advertisement

LPG Cylinder New Rules: గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. మే ఒకటి అనగా శుక్రవారం కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. అంతేకాదు సిలిండర్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త తెలియగానే వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నాయి. ఇంతకీ మారుతున్న కొత్త రూల్స్ ఏంటి? తెలుసుకుందాం?

గ్యాస్ వినియోగదారులకు సూచన

Advertisement

ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం నేపథ్యంలో ఎల్‌పీజీ‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా ధరలు ఆకాశాన్ని తాకాయి. అయినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. హార్ముజ్ జలసంధిపై ఆంక్షలు కొనసాగడంతో ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది.  అయినా చమురు సంస్థలు ధరల పెంచకుండా వాటి భారం మోయాల్సి వస్తోంది.

అంతేకాదు గ్యాస్ కొరత కారణంగా రోజుల తరబడి వేచి చూడాల్సి పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన నాలుగైదు రోజుల్లో డెలవరీ అయ్యేది. ఇప్పుడు 20 రోజులు గడిచినా ఫలితం లేకపోయింది. తాజాగా మే ఒకటి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. కొత్త నిబంధనలతో పాటు సిలిండర్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందన్నవార్తలు లేకపోలేదు.

Advertisement

మే 1 నుంచి కొత్త రూల్స్ మొదలు, బుకింగ్ టైమ్ కూడా

ధరల పెంపుతోపాటు బుకింగ్, డెలివరీ వ్యవస్థలో కొత్త మార్పులు రానున్నట్లు తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్ల వినియోగం, డిస్ట్రిబ్యూషన్‌ విషయంలో కఠినంగా వ్యవహరించాలని భావిస్తోంది కేంద్రం. బుకింగ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు కఠిన నిబంధనలు అమలు చేయనుంది. అంతా అనుకున్నట్లు జరిగితే మే ఒకటి నుంచి కొత్త మార్పులు అమలులోకి రావచ్చని మార్కెట్ వర్గాల అంచనా.

మార్చిలో చమురు సంస్థలు 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.60 మేరా పెంచింది. 19 కిలోల గ్యాస్ సిలిండర్ల ధరలను నెలరోజుల వ్యవధితో మూడు సార్లు పెంచాయి సంస్థలు. చమురు కంపెనీలు నష్టాల నుంచి బయటపడేందుకు ధరలు పెరిగే అవకాశముందని, పెంచిన ధరలు మే ఒకటి నుంచి అమల్లోకి రావచ్చని కొందరు అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు.

ALSO READ: హృదయ విదారకం.. సోదరి మరణాన్ని నిరూపించేందుకు అస్థిపంజరంతో బ్యాంక్‌కు వెళ్లిన త‌మ్ముడు.. ఇదిగో వీడియో!

గ్యాస్ సిలిండర్ బుకింగ్ రూల్స్ కఠిన తరం చేయనుంది. నగరాల్లోని బుకింగ్స్ కోసం 25 రోజుల పాటు వేచి చేయాల్సిందే. అంతకుముందు 21 రోజులుగా మాత్రమే ఉండేది. రూరల్ ప్రాంతాల విషయానికి వస్తే 45 రోజుల తర్వాత గ్యాస్ బుకింగ్ చేసుకునేందుకు సదుపాయం ఉంది.

దీనికితోడు గ్యాస్ బుకింగ్ నిబంధనలతోపాటు డెలివరీ వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. ఓటీపీ ఆధారిత అథెంటికేషన్ వ్యవస్థను శాశ్వతంగా అమలు చేసే అవకాశాలున్నాయి. దీనివల్ల సబ్సిడీ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కి తరలించకుండా నిరోధిస్తుందని అధికారుల మాట. ఆన్‌లైన్ బుకింగ్స్ 98 శాతంగా ఉండగా, అందులో 94 శాతం ఓటీపీ అథెంటికేషన్‌తో వెరిఫై చేస్తున్నారు.

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×