Army rescue: ఎత్తైన మంచు పర్వతాలు, వణికించే చలి, రోడ్లకు బదులు మంచు దిబ్బలే కనిపించే దూర ప్రాంతం.. ఇదే లడాఖ్‌లోని ముష్కో వాలీ. ఇక్కడి నుంచి ఒక గర్భిణి మహిళను ఆసుపత్రికి తరలించడం అంటే ప్రాణాలను పణంగా పెట్టిన సాహసం. కానీ, ఇండియన్ ఆర్మీ మానవత్వం ముందు ఒక కర్తవ్యమే. అందుకే ఒక్క మహిళ ప్రాణం కోసం ఏకంగా 56 మంది ఆర్మీ జవాన్స్ రంగంలోకి దిగారు.
తాజాగా జరిగిన ఈ ఘటనలో, 56 గోర్ఖ రైఫిల్స్ సైనికులు, ఖార్బు డ్రాస్‌లోని 108 అంబులెన్స్ సర్వీస్‌తో కలిసి మహిళకు ప్రాణాభిక్ష పెట్టారు. ఆ గర్భిణి ‘హై-రిస్క్’ కేస్ కావడంతో, ఒక్క నిమిషం ఆలస్యం అయినా ప్రమాదం తప్పదని వైద్యులు హెచ్చరించారు. కానీ, ముష్కో వాలీ నుంచి డ్రాస్‌లోని సబ్ డివిజనల్ హాస్పిటల్ వరకు దారితీసే మార్గం సులభం కాదు. మంచు కప్పిన లోయలు, కొండచరియల పక్కన సాగిపోయే ఇరుకైన రహదారులు, మధ్యలో ఎప్పుడైనా బ్లాక్ అయ్యే గాలి – మంచు తుఫానులు.
అయినా సరే, ఆర్మీ జవాన్లు ఒక నిమిషం ఆలస్యం చేయకుండా, తక్షణమే రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. ముందుగా గర్భిణి ఉన్న ఇంటి వరకు చేరి, వైద్యుల సూచనలతో ఆమెను సురక్షితంగా స్ట్రెచర్‌లోకి మార్చారు. ఆ తర్వాత మంచులో జారి పడకుండా జాగ్రత్తగా, ఒక్క అడుగు ముందుకు వేస్తూ, కొంత దూరం నడిచి, తరువాత అంబులెన్స్‌లోకి చేర్చారు.
అంతటితో అయిపోలేదు.. అంబులెన్స్ డ్రైవర్ కూడా ప్రాణాలకు తెగించి, మంచుతో నిండిన వంకర వంకర రహదారుల్లో వేగంగా, కానీ సురక్షితంగా డ్రైవ్ చేశారు. మధ్యలో కొన్ని చోట్ల రోడ్డుపై మంచు తుఫాను కురవడంతో అంబులెన్స్ ఆగిపోవాల్సి వచ్చింది. అలాంటప్పుడు ఆర్మీ జవాన్లు మళ్లీ స్ట్రెచర్‌పై తీసుకుని కిలోమీటర్ల దూరం నడిచి, తరువాత వాహనంలోకి ఎక్కించారు.
ఇలా గంటలపాటు సాగిన కష్టమైన ప్రయాణం తర్వాత, చివరకు ఆమెను సబ్-డివిజనల్ హాస్పిటల్ డ్రాస్‌కి చేర్చగలిగారు. అక్కడ వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించి, తల్లి, శిశువు ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
Also Read: Nagarjunasagar flood: నాగార్జునసాగర్ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!
ఈ ఘటన మరోసారి ఇండియన్ ఆర్మీ కేవలం యుద్ధభూమిలోనే కాకుండా, మానవత్వానికి అండగా నిలుస్తుందని నిరూపించింది. లడాఖ్‌లో, ముఖ్యంగా ముష్కో వాలీ వంటి దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు, ఆర్మీ అనేది కేవలం రక్షణ దళం కాదు.. విపత్కర సమయంలో ఆపన్నహస్తం అందించే చర్యలకు వెనుకాడదని మరోమారు నిరూపితమైంది.
స్థానిక ప్రజలు ఆర్మీ జవాన్లకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఇవాళ ఒక మహిళ ప్రాణం కోసం ఆర్మీ దిగింది ఇక సేఫ్ అని తాము భావించామన్నారు. 108 అంబులెన్స్ సిబ్బంది కూడా సమయానికి సహకరించి, సమన్వయం చూపిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
లడాఖ్‌లో ఇలాంటి హై-రిస్క్ మెడికల్ కేసులు సాధారణమే కానీ, వీటిని సమయానికి హాస్పిటల్‌కి చేర్చడం ఎప్పుడూ సవాల్‌గానే ఉంటుంది. మంచు, ఎత్తైన ప్రదేశాలు, వాతావరణ మార్పులు అన్నీ కలిసొచ్చి సమస్యలను పెంచుతాయి. కానీ, ఈ ఘటన ధైర్యం, కట్టుదిట్టమైన ప్లానింగ్, టీమ్‌వర్క్ ఉంటే ఏ అడ్డంకీ దాటలేనిది కాదని నిరూపించింది.
ఇది మానవత్వం, కర్తవ్యభావం, సమయపాలన, సాహసం అన్నింటికీ ఒక ప్రత్యక్ష ఉదాహరణ. లడాఖ్ ముష్కో వాలీ నుంచి డ్రాస్ హాస్పిటల్‌కి సాగిన ఈ ప్రాణరక్షణ యాత్ర, ఆర్మీ చరిత్రలో, అలాగే అక్కడి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.