FASTag Annual Pass: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక నిర్ణయం తీసకుంది. భారతదేశంలో ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు వ్యవస్థ అయిన ఫాస్టాగ్, ఆగస్టు 15న ఓ పెద్ద అప్‌గ్రేడ్‌ను పొందనుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్టాగ్ వార్షిక పాస్‌ను ప్రవేశపెడుతోంది. ఇది తరచూ ప్రయాణించే వారికి హైవే ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త పాస్‌తో, ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్‌ల యజమానులు ఒక్కసారి రూ. 3,000 చెల్లించడం ద్వారా 200 టోల్ క్రాసింగ్‌లు లేదా ఒక సంవత్సరం పాటు ప్రయాణించే అవకాశం పొందుతారు. ఏది ముందు అయిపోతే అది లెక్కలోకి తీసుకుంటారు. ఈ పథకం రీఛార్జ్‌ల ఇబ్బందిని తగ్గించడం, టోల్ లావాదేవీలను వేగవంతం చేయడం, టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఫాస్టాగ్ వార్షిక పాస్ అంటే..
ఈ సంవత్సరం జూన్‌లో ప్రకటించిన ఫాస్టాగ్ వార్షిక పాస్, కమర్షియల్ కాని ప్రైవేట్ వాహనాలైన కార్లు, జీపులు, వ్యాన్‌ల కోసం రూపొందించిన ఒక ప్రీపెయిడ్ టోల్ ప్లాన్. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ పాస్‌ను ప్రకటిస్తూ, 60 కి.మీ. లోపు ఉన్న టోల్ ప్లాజాల సమస్యలను పరిష్కరించడం.. అలాగే ఒకే చెల్లింపు ద్వారా టోల్ చెల్లింపులను సరళీకరించడం దీని ఉద్దేశ్యమని చెప్పారు. ఈ పాస్ వేచి ఉండే సమయాన్ని తగ్గించడం, రద్దీని తగ్గించడం, టోల్ ప్లాజాల వద్ద వివాదాలను నివారించడం ద్వారా లక్షల మంది ప్రైవేట్ వాహన యజమానులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించనుంది.
ఈ పాస్ కొత్త ఫాస్టాగ్ కొనుగోలు చేయడం కాకుండా, ఇప్పటికే ఉన్న యాక్టివ్ ఫాస్టాగ్‌కు లింక్ అవుతుంది. అది మీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌తో అనుసంధానం చేసి ఉండాలి. ఈ ప్లాన్ NHAI, రోడ్ రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ (MoRTH) ఆధ్వర్యంలోని నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలకు మాత్రమే వర్తిస్తుంది. ఇది రోజువారీ ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది పదేపదే రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పాస్ బదిలీ చేసేందుకు ఆస్కారం లేదు మరియు ఒకే రిజిస్టర్డ్ వాహనంతో లింక్ చేయబడిన ఫాస్టాగ్‌తో మాత్రమే పనిచేస్తుంది.
ఫాస్టాగ్ వార్షిక పాస్ ఎలా కొనుగోలు చేయాలంటే..
ఫాస్టాగ్ వార్షిక పాస్‌ను కొనుగోలు చేయడానికి ఈ క్రింది దశలను ఫాల్లో అవ్వండి..
* ముందుగా రాజ్‌మార్గ్ యాత్ర యాప్ లేదా NHAI/MoRTH వెబ్‌సైట్‌ను సందర్శించండి.
* మీ వాహన నంబర్, ఫాస్టాగ్ ID వంటి వివరాలను నమోదు చేసి లాగిన్ చేయండి. ఫాస్టాగ్ యాక్టివ్‌గా ఉండి, సరిగ్గా ఇన్‌స్టాల్ చేసి, మీ వాహనంతో లింక్ అయి ఉండాలి.
* రూ. 3,000ను UPI, డెబిట్/క్రెడిట్ కార్డ్, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించండి.
* పాస్ మీ ఇప్పటికే ఉన్న ఫాస్టాగ్‌కు లింక్ అవుతుంది. ఆగస్టు 15 న యాక్టివేషన్ SMS ద్వారా నిర్ధారణ వస్తుంది.
ఎక్కడ పనిచేస్తుందంటే..?
ఫాస్టాగ్ వార్షిక పాస్, NHAI ఆధ్వర్యంలోని నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలోని టోల్ ప్లాజాల వద్ద మాత్రమే పనిచేస్తుంది. ఉదాహరణకు, ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే, ముంబై-నాసిక్, ముంబై-సూరత్, ముంబై-రత్నగిరి మార్గాల్లో పనిచేస్తోంది. రాష్ట్ర హైవేలు లేదా మున్సిపల్ టోల్ రోడ్లలో (ఎగ్జాంపుల్, ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వే, ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే, అటల్ సేతు, ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే, బెంగళూరు-మైసూర్ ఎక్స్‌ప్రెస్‌వే, అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌వే) ఫాస్టాగ్ సాధారణంగా పనిచేస్తుంది, కానీ సాధారణ టోల్ ఛార్జీలు వర్తిస్తాయి. మీ మార్గం కవర్ అవుతుందా అని సందేహం ఉంటే స్థానిక టోల్ అథారిటీలతో తనిఖీ చేయండి.
ఆగస్టు 15 నుండి, పాస్ ఒక్కో టోల్ క్రాసింగ్‌కు ఒక ట్రిప్‌ను డిడక్ట్ చేస్తుంది. 200 ట్రిప్‌లు లేదా ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత, సిస్టమ్ సాధారణ పే-పర్-యూజ్ ఫాస్టాగ్‌కు మారుతుంది.
ముఖ్య గమనిక..
– కేవలం ప్రైవేట్ వాహనాలకు మాత్రమే.
– బదిలీ చేయడం లేదా రీఫండ్ సాధ్యం కాదు.
– NHAI హైవేలు,ఎక్స్‌ప్రెస్‌వేలకు మాత్రమే వర్తిస్తుంది.
– ఆటో-రెన్యూవల్ లేదు.. గడువు ముగిసిన వెంటనే మళ్లీ దరఖాస్తు చేయాలి.
ఈ పాస్ రోజువారీ ప్రయాణికులకు సౌలభ్యం, ఆర్థిక ప్రయోజనాలను అందిస్తూ, హైవే ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది.
ALSO READ: Constable Jobs: భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పది పాసైతే చాలు.. రూ.69వేల జీతం
ALSO READ: Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..