BigTV English

Hyderabad:తల్లి పేరుతో మొక్కను నాటిన కేంద్ర మంత్రి

Hyderabad:తల్లి పేరుతో మొక్కను నాటిన కేంద్ర మంత్రి

Central Minister G Kishan Reddy plant a tree in the name of his Mother


తాను ఎండకు ఎండిపోతూ మనలకు నీడనిస్తూ..ప్రకృతి పులకరించి వర్షమై పలకరించే శక్తిని ఇచ్చేది కేవలం మొక్క మాత్రమే. విత్తుగా మొదలై వృక్షమై మానవాళికి మహోన్నత మేలు చేసేది మొక్క మాత్రమే.అయితే ఇటీవల ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ప్రసారంలో దేశంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక మహోద్యంగా చెయ్యాలని..అలాగే మన తల్లిని గౌరవించుకోవాలని, పర్యావరణ పరిరక్షణలో దీనిని భాగం చేయాలని అమ్మ పేరుతో ప్రతి ఒక్కరూ ‘ఏక్ పేడ్ మాకే నామ్’ నినాదాన్ని ఇచ్చారు. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘ఏక్ పేడ్ మాకే నామ్’ పిలుపు ఊపందుకుంది. మోదీ పిలుపునందుకుని దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు స్పందిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు పలువురు ఇప్పటికే తమ నియోజకవర్గాలలో మొక్కల పెంపకాన్ని వినూత్నంగా ప్రారంభిస్తున్నారు.
ప్రధాని మోదీ ఇచ్చిన స్ఫూర్తితో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గురువారం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మొక్కను నాటారు. ప్రతి ఒక్కరూ దీనిని ఉద్యమంగా చేపట్టాలని కోరారు. మనందరికీ స్ఫూర్తిదాయకమైన అమ్మను స్మరించుకుంటూ ఆమె పేరిట మొక్కను నాటాలని సూచించారు.

అమ్మకు స్ఫూర్తినిద్దాం


‘మనందరి జీవితాలలో అమ్మ తర్వాతే ఏదైనా..మనలను నవమాసాలు మోసి కని, పెంచిన అమ్మకు మనం ఈ మాత్రం చేయలేమా? చిన్నతనంలో మనలను ఎంత జాగ్రత్తగా అమ్మ పెంచిందో అలాగే మనమంతా మొక్కను పెంచుకోవాలి. కేవలం నాటి వదిలేయడం కాదు. వాటి సంరక్షణ కోసం ఎంతో జాగ్రత్తలు సైతం తీసుకోవాలి. మన చుట్టు పక్కల ప్రకృతి పర్యావరణాన్ని మొక్కలు పెంచుకోవడం ద్వారా పరిరక్షించుకుందాం. అదే స్థాయిలో మన తల్లికి గౌరవం కలిగేలా ఆమె పేరు పెట్టుకుందాం. అమ్మ ఒక ప్రేరణ కావాలి..మొక్క మన స్ఫూర్తి కావాలి. మన ప్రధాని మోదీ కూడా ఇదే కోరుతున్నారు. అనునిత్యం మనమంతా బిజీలో పడిపోయి ప్రకృతి పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. మనమంతా ఓ కాంక్రీట్ జంగిల్ లో పడి కొట్టుమిట్టాడుతున్నాం. భవిష్యత్ లో వచ్చే ప్రకృతి విపత్తులను నివారించడానికి మొక్కలు నాటడమే నివారణ మార్గం . ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా మొక్కలు నాటాలి. జననీ జన్మభూమిశ్చ అన్నట్లుగా భరతమాత కూడా మన అమ్మే అని పూజించాలి. మొక్కలు నాటడం ద్వారా దేశానికి కూడా సేవచేసినట్లవుతుంది. ప్రతి ఒక్కరూ సామాజిక స్ఫూర్తితో ‘ఏక్ పేడ్ మాకే నామ్’ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గం,జిల్లా, మండల కేంద్రాలలో విజయవంతం చేయాలి’ అని సూచించారు . ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని సమాజంలో సెలబ్రిటీలు తప్పనిసరిగా పాటించాలి. వారిని స్ఫూర్తిగా తీసుకుని మిగిలినవారు సైతం మొక్కలు నాటుతారని అన్నారు. రాబోయే తరాలకు నీడనిచ్చే చెట్లను అందిద్దాం. రేడియేషన్ ప్రభావంతో భూమండలమంతా వేడెక్కిపోయిందని దానికి నివారణ కేవలం మొక్కలు నాటడమే అన్నారు.

Tags

Related News

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Big Stories

×