E-Paper
Advertisement

బెం సొంత కోట భవానీపూర్‌లో మమతా బెనర్జీ ఘోర పరాజయం.. పోలింగ్ బూత్ లో ఆమెను కొట్టారా?

బెం సొంత కోట భవానీపూర్‌లో మమతా బెనర్జీ ఘోర పరాజయం.. పోలింగ్ బూత్ లో ఆమెను కొట్టారా?
Advertisement

Mamata Banerjee is beaten inside booth: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత కంచుకోట అయిన భవానీపూర్ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. బీజేపీ సీనియర్ నేత.. ప్రతిపక్ష నేత సువేందు అధికారి సుమారు 15,105 ఓట్ల భారీ మెజార్టీతో ఆమెపై చారిత్రాత్మక విజయం సాధించారు. గతంలో నందిగ్రామ్‌లోనూ మమతను ఓడించిన సువేందు.. ఇప్పుడు భవానీపూర్‌లోనూ ‘జెయింట్ కిల్లర్’గా నిలిచి ఆమె రాజకీయ ప్రస్థానానికి పెద్ద షాక్ ఇచ్చారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలోకి రావడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ లోపల తనపై దాడి జరిగిందని, తనను కొట్టారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచ‌ల‌న‌ ఆరోపణలు చేశారు. ఈ ఫలితాలను తాను అంగీకరించబోనని.. ఇది నైతిక విజయం కాదని ఆమె తెగేసి చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని.. బీజేపీ వందకు పైగా స్థానాలను దౌర్జన్యంగా దోచుకుందని ఆమె ఆరోపణలు చేశారు.

Advertisement

“దీనిని మీరు విజయమని భావిస్తున్నారా? ఇది అనైతిక విజయం. ఎన్నికల సంఘం ఇప్పుడు బీజేపీ కమిషన్‌లా మారిపోయింది. ఇదంతా లూటీ.. లూటీ.. లూటీ మాత్రమే! మేము మళ్లీ పుంజుకుంటాం.. పోరాటం ఆపం” అని మమత వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని.. మనోజ్ అగర్వాల్ వంటి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు మమతా బెనర్జీ సొంత నియోజకవర్గమైన భవానిపూర్‌లో పరిస్థితి అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. తన మాజీ సహచరుడు.. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆమెపై స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇంకా మూడు రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉండగానే.. సువేందు 6,226 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.

Advertisement

Read Also: కేరళంలో యూడీఎఫ్ అద్భుత విజయం.. ఎర్రకోటలు బద్దలయ్యాయి, కేసీ వేణుగోపాల్ సంచలనం

Related News

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కే ‘తిరంగా యాత్ర’ అడ్డుకున్న పోలీసులు.. ఇంటికెళ్లి నోటీసులు అందజేత!

అమ్మబాబోయ్.. 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి పెళ్లి.. నిశ్చితార్థం వీడియో వైరల్!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 1,688 ఖాళీలు, సాలరీ, దరఖాస్తు పూర్తి వివరాలివిగో

నా ఇంటి చుట్టూ నిఘా పెట్టారు.. ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే

ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఎలాన్ మస్క్ బిగ్ ట్విస్ట్..?

Big Stories

Advertisement
×