BigTV English

RSS Chief Mohan Bhagwat: మణిపూర్ హింసపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..

RSS Chief Mohan Bhagwat: మణిపూర్ హింసపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..

RSS Chief Mohan Bhagwat on Manipur Violence: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌లో శాంతి అవసరమన్నారు. మణిపూర్ గత సంవత్సర కాలంగా శాంతి కోసం ఎదురుచూస్తోందని.. యుద్ధ ప్రాతిపదికన మణిపూర్‌లో శాంతి కోసం ప్రభుత్వం పాటు పడాలన్నారు. నాగ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ ట్రైనీల బృందాన్ని ఉద్దేశించి మోహన్ భగవత్ ఈ సాయంత్రం హింసాత్మక మణిపూర్, ముగిసిన లోక్‌సభ ఎన్నికల గురించి ప్రస్తావించారు.


సంఘ్ ప్రతి ఎన్నికల్లోనూ ప్రజాభిప్రాయాన్ని మెరుగుపర్చడానికి కృషి చేస్తుందని.. ఈసారి కూడా అదే పని చేసింది, కానీ ఫలితాల విశ్లేషణలో చిక్కుకోలేదని అన్నారు. “ఎన్నికలు ప్రజాస్వామ్యానికి అవసరమైన ప్రక్రియ. ఇందులో రెండు వర్గాలు ఉండటంతో పోటీ నెలకొంది. ఇది పోటీ కావడంతో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దానికి ఒక గౌరవం ఉంది. అబద్ధాలు వాడకూడదు. పార్లమెంటుకు వెళ్లి మన దేశాన్ని నడిపించడానికి నేతలను ఎన్నుకున్నారు. ఈ పోటీ యుద్ధం కాదు,” అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో ప్రతికూలతపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు, ఎన్నికల ప్రచార సమయంలో విభజనకు తావు తీసేలా ప్రసంగాలున్నాయన్నారు. అసత్యాన్ని ప్రచారం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడారని.. అనవసరంగా RSS ను ఇందులోకి లాగారని అన్నారు. అలా వ్యాపింపజేసిందంతా అసత్యమన్నారు.


Also Read: నిన్న ఎన్సీపీ, నేడు శివసేన.. మంత్రి వర్గం కూర్పుపై మహారాష్ట్రలో ముసలం..

ఈశాన్య రాష్ట్రం కుకీ జో, మెయిటీ అనే రెండు జాతి వర్గాల మధ్య ఘర్షణలతో అట్టుడికిపోతోంది. అయితే మణిపూర్‌లో భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయింది. ఈశాన్య రాష్ట్రాన్ని లోని రెండు స్థానాలను కాంగ్రెస్ నాయకులు గెలుచుకున్నారు.

Related News

Vice President: భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్..

Vice President Election: ఉప రాష్ట్రపతి ఎన్నిక.. రాధాకృష్ణన్ Vs సుదర్శన్ రెడ్డి

Social Media Ban: నేపాల్‌లో హింసాత్మకంగా యువత నిరసనలు.. కాల్పుల్లో 20 మంది మృతి

Amruta Fadnavis: బీచ్‌‌ను శుభ్రం చేసిన సీఎం భార్య.. ఆమె డ్రెస్ చూసి నోరెళ్లబెట్టిన జనం

NDA Cheap Tricks: ఆహా.. బీహార్ అంటే కేంద్రానికి ఎంత ప్రేమ.. ఇవేం చీప్ ట్రిక్స్?

Drugs Case: చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు

×