BigTV English

CM Revanth Reddy: రైతులకు శుభవార్త.. రుణమాఫీపై అధికారులకు సీఎం ఆదేశాలు

CM Revanth Reddy: రైతులకు శుభవార్త.. రుణమాఫీపై అధికారులకు సీఎం ఆదేశాలు

CM Revanth Reddy on crop loans(TS today news): పంట రుణమాఫీకి సంబంధించిన విధి విధాలను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరతామని స్పష్టం చేశారు. రుణమాఫీకి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.


పంట రుణమాఫీ, ఇతర అంశాలపై వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రచార అస్త్రం పంట రుణమాఫీ. అయితే ఆగస్టు 15లోపు సంపూర్ణ రుణమాఫీ అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా పంట రుణమాఫీతో పాటు ఇతర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

అనంతరం పంట రుణమాఫీకి విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రూ. 2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని తెలిపారు. పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని తెలిపారు. కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.


Also Read:  తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ?

కేవలం బ్యాంకు నుంచే కాకుండా.. పీఏసీఎస్ నుంచి పంట రుణాలు తీసుకున్న రైతల వివరాలు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసేందుకు పూర్తి స్థాయి వివరాలతో పాటు అవసరమైన అంచనా వ్యయాన్ని రూపొందించాలని అన్నారు. ఎట్టి పరిస్థితిలోనైనా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాలని అధికారులకు తేల్చి చెప్పారు.

Related News

Mandula Samuel: నిరూపిస్తే లారీ కింద పడతా.. తుంగతుర్తి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Weather News: దూసుకొస్తున్న వాయుగుండం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. జాగ్రత్త..!

KTR: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మా మద్దతు ఆ పార్టీకే.. ఈ ఎలక్షన్ అంతా ఓ డ్రామా: కేటీఆర్

PC Ghosh Commission: అందుకే ఇదంతా.. మేడిగడ్డ కుంగుబాటు అసలు కారణం ఇదే: KCR

Rain Alert: బిగ్ అలర్ట్! మరో 3 రోజులు కుండపోత వర్షాలు.. ఎవరు బయటకు రావొద్దు..

Marwadi Controversy: మర్వాడీస్ రచ్చ.. అసలు కారణాలు ఇవే! ఎక్కడిదాకా వెళ్తోంది?

Big Stories

×