E-Paper
Advertisement

Mumbai : 31 ఏళ్ల క్రితం తప్పించుకున్న నిందితుడు.. పోలీసులకు పట్టించిన భార్య ఫోన్ కాల్..

Mumbai : 31 ఏళ్ల క్రితం తప్పించుకున్న నిందితుడు.. పోలీసులకు పట్టించిన భార్య ఫోన్ కాల్..
Advertisement

Mumbai : భార్య చేసిన ఒక ఫోన్ కాల్ 31 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పోలీసులకు దొరికేలా చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముంబయికి చెందిన దీపక్ నారాయణ్ భీసే అనే వ్యక్తి 1989లో జరిగిన ఓ హత్యకేసులో నిందితుడు. 1992లో ఇతనికి బెయిల్ మంజూరయ్యింది. దీపక్ నారాయణ్ అప్పటి నుంచి కోర్టు విచారణకు హాజరుకాలేదు. 2003లో కోర్టు ఇతను పరారీలో ఉన్నట్టు ప్రకటించింది. అతని ఆచూకీ కనిపెట్టాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.

పోలీసులు దీపక్ స్వగ్రామానికి వెళ్లి విచారణ చేపట్టినప్పుడల్లా చనిపోయి ఉంటాడని స్థానికులు తెలిపేవారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా దీపక్ భార్య ఫోన్ నంబర్ సంపాదించారు. ఫోన్ నంబర్ ద్వారా ట్రాక్ చేసి ముంబయికి 60 కి.మీల దూరంలో ఉన్న నాలాసొపార గ్రామంలో దీపక్ ను పట్టుకున్నారు. 31 ఏళ్ల నుంచి వివిధ ప్రాంతాలు మార్చాడు. చివరికి తన భార్య, ముగ్గురు పిల్లలతో రెండేళ్లుగా నాలాసొపారాలో జీవిస్తున్నాడు. భార్య ఫోన్ కాల్ ద్వారా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×