E-Paper
Advertisement

స్పోర్టీ లుక్.. అదిరిపోయే స్పీడ్.. భారత్‌లో టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

స్పోర్టీ లుక్.. అదిరిపోయే స్పీడ్.. భారత్‌లో టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
Advertisement

Fast and Sporty Electric Scooters: ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే కేవలం రోజువారీ ఆఫీస్, మార్కెట్ ప్రయాణాలకు ఉపయోగపడే వెహికల్ అనే అభిప్రాయం ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు మారుతోంది. కొత్త తరం EV స్కూటర్లు వేగం, యాక్సిలరేషన్, డిజైన్, రైడింగ్ డైనమిక్స్ విషయంలో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా స్పోర్టీ రైడింగ్‌ను ఇష్టపడే వారికి మార్కెట్లో కొన్ని ఆసక్తికరమైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో టాప్ మోడల్స్ గురించి ఇప్పుడు చూద్దాం..

1.ఓలా S1 ప్రో స్పోర్ట్

పనితీరుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఓలా S1 ప్రో స్పోర్ట్ ముందుంటుంది. ఇందులో 4680 సెల్ బ్యాటరీతో పాటు మిడ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది గరిష్టంగా 16kW పవర్, 71Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 0-40 kmph వేగాన్ని కేవలం 2 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం 152 kmph. 5.2kWh బ్యాటరీతో 320 కిలోమీటర్ల IDC రేంజ్ లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.1.49 లక్షలు.

2.సింపుల్ వన్

Advertisement

స్పోర్టీ రైడింగ్‌ను కోరుకునే వారికి సింపుల్ వన్ మరో బెస్ట్ ఆప్షన్. 5kWh వెర్షన్‌లో PMSM మోటార్ 11.8bhp పవర్, 72Nm టార్క్‌ ను అందిస్తుంది. తక్కువ వేగంలోనే ఎక్కువ టార్క్ లభిస్తుంది. 0-40 kmph వేగాన్ని 2.55 సెకన్లలో అందుకుంటుంది.  గరిష్ట వేగం 115 kmph కాగా, IDC రేంజ్ 265 కిలోమీటర్లుగా ఉంది. దీని ధర సుమారు రూ.1.78 లక్షలు.

3.ఏథర్ 450 అపెక్స్

ఏథర్ 450 అపెక్స్ విషయంలో కేవలం స్పీడ్ కంటే రైడింగ్ అనుభూతికి కంపెనీ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. మంచి ఛాసిస్, బ్రేకింగ్, హ్యాండ్లింగ్ కారణంగా  స్పోర్టీ రైడ్‌ను కోరుకునే వారికి ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో 7kW పీక్ మోటార్ ఉండగా, 9.4bhp పవర్, 26Nm టార్క్ లభిస్తుంది. 0-40 kmph వేగాన్ని 2.9 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం 100 kmph. 3.7kWh బ్యాటరీ 165km IDC రేంజ్‌ను అందిస్తుంది. ధర రూ.1.95 లక్షల నుంచి మొదలవుతుంది.

4.TVS X

Advertisement

TVS X సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్లకు భిన్నమైన డిజైన్‌తో వస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్, మోనోషాక్ రియర్ సస్పెన్షన్, మోటార్‌ సైకిల్ తరహా రైడింగ్ పొజిషన్ దీని ప్రత్యేకత. దీని PMSM మోటార్ 14.8bhp పవర్, 40Nm టార్క్‌ ను అందిస్తుంది. 0-40 kmph వేగాన్ని సుమారు 2.5 సెకన్లలో చేరుకుంటుంది. టాప్ స్పీడ్ 110 kmph కాగా, 4.43kWh బ్యాటరీతో సుమారు 159km రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. దీని ధర రూ.2.66 లక్షల నుంచి ఉంటుంది.

5.యమహా ఏరాక్స్-E

స్పోర్టీ మ్యాక్సీ స్కూటర్ డిజైన్‌కు పేరున్న ఏరాక్స్‌ ను యమహా ఎలక్ట్రిక్ రూపంలో తీసుకొచ్చింది. జూలై 2026లో భారత్‌లో విడుదలైన ఏరాక్స్-E, పెట్రోల్ మోడల్‌ లోని స్టైలింగ్‌ను కొనసాగిస్తుంది. PMSM మోటార్ 12.6bhp పవర్, 48Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. టాప్ స్పీడ్ 95.5 kmph. రెండు 1.5kWh బ్యాటరీలతో 117km రేంజ్ లభిస్తుంది. ఎకో, స్టాండర్డ్, పవర్ మోడ్‌లతో పాటు యాక్సిలరేషన్ కోసం బూస్ట్ మోడ్ కూడా ఉంది. దీని  ధర రూ.2.82 లక్షలు.

Read Also: బ్లాక్ కలర్‌కు గుడ్‌బై.. కొత్త లుక్‌తో 2027 కవాసకి వల్కన్ ఎస్ వచ్చేసింది!

Tags

Related News

బ్లాక్ కలర్‌కు గుడ్‌బై.. కొత్త లుక్‌తో 2027 కవాసకి వల్కన్ ఎస్ వచ్చేసింది!

చిన్న కారు.. పెద్ద రేంజ్.. భారత్‌ లోకి వస్తున్న కొత్త కాంపాక్ట్ ఈవీలివే!

2.7 సెకన్లలో 100 కిమీ స్పీడ్.. భారత్‌ లోకి అడుగు పెట్టబోతున్న BYD పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ కారు!

యాక్టివా To బర్గ్‌ మన్.. ఏథర్ కోనార్క్‌ కు పోటీ ఇచ్చే 6 స్కూటర్లు ఇవే!

హ్యుందాయ్ కొత్త SUV పేరు ఇదే.. త్వరలో మార్కెట్లోకి ఎంట్రీ!

మరోసారి పెరిగిన అమేజ్ ధర.. ఆటోమేటిక్ వేరియంట్‌పై భారీ పెంపు!

స్విఫ్ట్ ధర మళ్లీ పెరిగింది.. ఇప్పుడు రేటు ఎంతంటే?

Big Stories

Advertisement
×