UPI Charges: మోదీ ప్రభుత్వం సాగిస్తున్న దోపిడీ ఇప్పుడు UPI వరకు పాకిందని కాంగ్రెప్ పార్టీ జాతీయ అద్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. “UPIపై ఎటువంటి రుసుములు లేవు” అనే విధానం కాస్తా, “₹2,000 వరకు జరిగే UPI లావాదేవీలపై మాత్రమే రుసుములు లేవు” అనేలా మారిందని అన్నారు. ఆకాశాన్ని తాకుతున్న ధరల పెరుగుదల సామాన్యుడి జేబును ఇప్పటికే ఖాళీ చేసిందని ఖర్గే అన్నారు.
టోకు ధరల ద్రవ్యోల్బణం దాదాపు 10% వద్ద ఉందని, ఇలాంటి తరుణంలో ప్రజల దగ్గర మిగిలి ఉన్న కొద్దిపాటి పొదుపును కూడా హరించాలన్నట్లుగా, వారిపై “డిజిటల్ చెల్లింపుల పన్ను” విధించాలని బీజేపీ ప్రభుత్వం యోచిస్తోందని మల్లికార్జున ఖర్గే క్లారిటీ ఇచ్చారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద యూ-టర్న్ ను గమనించండని అన్నారు. దేశంలొ గత పదేళ్ల క్రితం, పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద కుదుపును కలిగించిందని గుర్తు చేశారు. ఆ నిర్ణయం వల్ల కలిగిన వినాశకరమైన పరిణామాలపై ప్రశ్నలు తలెత్తినప్పుడు, డిజిటల్ చెల్లింపులను మరియు నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికే ఆ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం వాదించిందని అన్నారు.
Also read: ఏపీలో తీవ్ర విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
UPIపై ఎటువంటి పన్నులు లేదా రుసుములు విధించబోమని ఆర్థిక మంత్రి ఇటీవల పార్లమెంటులో ప్రకటించారు.రూ. 5,000 లావాదేవీపై రూ.25 మరియు రూ.10,000 లావాదేవీపై రూ.50 వరకు వసూలు చేసే అవకాశం ఉంది. ఇది నిజమేనా? అని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. MDR (మర్చంట్ డిస్కౌంట్ రేట్) విషయానికి వస్తే, వ్యాపారులపై పడే ఈ అదనపు భారం చివరికి ధరల పెంపు రూపంలో సామాన్య వినియోగదారుడి జేబు నుండే వసూలు చేయబడుతుందన్న విషయం ప్రభుత్వానికి తెలియదా అని ఫైర్ అయ్యారు. ధరల భారం వల్ల సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించడానికి బదులుగా, వారి జేబులను దోచుకోవడానికి మోదీ ప్రభుత్వం ప్రతిరోజూ కొత్త మార్గాలను అన్వేషిస్తోందని మల్లికార్జున ఖర్టే క్లారిటీ ఇచ్చారు.
Also read: సీఎం రేవంత్‌తో వేవ్‌లెంగ్త్ మ్యాచ్ అయింది.. ! బీసీ మంత్రి భర్తరఫ్‌పై టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!