Traffic Challans: ఇటీవల సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతున్న ఒక వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సెప్టెంబర్ 13న అన్నీ ట్రాఫిక్ ఛాలన్లు రద్దు అవుతాయి” అని చాలామంది చెబుతున్నారు. ఈ వార్త విన్న వెంటనే వాహనదారుల్లో ఆశ కలుగుతోంది. ఎందుకంటే, ప్రతి ఒక్కరి దగ్గర వందల రూపాయల నుంచి లక్షల వరకు ఛాలన్లు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఇది నిజంగానే పూర్తిగా మాఫీ చేస్తారా? లేక వాస్తవం వేరేలా ఉందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 13
ఈ లోక్ అదాలత్ సెప్టెంబర్ 13, 2025న దేశవ్యాప్తంగా జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని డెల్హీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇది జరుగుతుంది. మరో విషయం ఏమిటంటే, ఇది పూర్తి మాఫీ కాదు. కానీ నేషనల్ లోక్ అదాలత్ అనే ప్రత్యేక న్యాయ వేదికలో పెండింగ్ చలాన్లు తక్కువ మొత్తంలో క్లియర్ చేసుకునే అవకాశం వస్తోంది.
లోక్ అదాలత్ అంటే ఏమిటి?
లోక్ అదాలత్ అనేది ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్ట్. ఇక్కడ కేసులు సంవత్సరాల తరబడి సాగకుండా, ఒకే రోజులోనే ఇరువర్గాలతో మాట్లాడి అవగాహనతో తీర్పు ఇస్తారు. ఇక్కడ ఇచ్చే తీర్పు ఫైనల్, మళ్లీ అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదు. ట్రాఫిక్ చలాన్లు కూడా ఇందులో పరిష్కరించుకునే అవకాశం కలదు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్ లోక్ అదాలత్ దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించబడుతోంది. అంటే ఇది ఒకే రాష్ట్రానికి పరిమితం కాకుండా, దేశంలోని ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, పట్టణం, గ్రామస్థాయిలోనూ సంబంధిత రాష్ట్ర న్యాయ సేవా సంస్థలు లేదా జిల్లా న్యాయ సేవా సంస్థల ఆధ్వర్యంలో అమలు అవుతుంది
ఎవరెవరు ఈ అవకాశం వినియోగించుకోవచ్చు?
* మే 31, 2025 వరకు పడిన పెండింగ్ ట్రాఫిక్ ఛాలన్లు ఉన్నవారు.
* ఈ చలాన్లు వర్చువల్ కోర్ట్స్‌లో ఉన్నా, డైరెక్ట్ ట్రాఫిక్ పోలీస్ దగ్గర ఉన్నా, లోక్ అదాలత్‌లో పరిష్కారం పొందవచ్చు.
ప్రజలకు ముఖ్యంగా అవసరమైన విషయం – ట్రాఫిక్ చలాన్లు
* మే 31, 2025 వరకు పడిన పెండింగ్ ఛాలన్లు ఈ లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చు.
* వర్చువల్ కోర్ట్స్‌లో ఉన్న ఛాలన్లు కూడా ఈ కార్యక్రమంలో తీసుకుంటారు.
* ప్రజలు తమ ఛాలన్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. https://traffic.delhipolice.gov.in/notice/lokadalat
అనే లింక్ ద్వారా లేదా QR కోడ్ ద్వారా స్లిప్ తీసుకోవచ్చు.
* సెప్టెంబర్ 8, 2025 ఉదయం 10 గంటల లోగా తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని గుర్తించుకోండి.
* సుమారు 60 నుండి రూ.1,80,000 వరకు చలాన్లు ఈ లోక్ అదాలత్‌లో క్లియర్ చేసుకునే అవకాశం ఉంది.
దీని లాభం ఏమిటి?
కోర్టులో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండే కేసులు ఇక్కడ ఒక రోజులోనే తేలిపోతాయి. అందుకే దీనిని “పీపుల్స్ కోర్ట్” అని అంటారు. ఒకసారి లోక్ అదాలత్‌లో తీర్పు వెలువడితే, అది ఫైనల్‌గా పరిగణిస్తారు. తర్వాత మళ్లీ అప్పీలు చేయలేరు.
గుర్తుంచుకోవాల్సిన విషయం
* ఇది ఆటోమేటిక్ మాఫీ కాదు. అంటే సెప్టెంబర్ 13న అన్నీ ఛాలన్లు రద్దు అనేది నిజం కాదు.
* మీరు తప్పనిసరిగా లోక్ అదాలత్‌లో అప్లై చేసి, అక్కడ మీ కేసు లేదా ఛాలన్‌ను పరిష్కరించుకోవాలి.
* అధికారిక లింక్ లేదా కోర్టు నుండి ఇచ్చే నోటీసులు మాత్రమే నమ్మాలి.
సెప్టెంబర్ 13, 2025న జరిగే నేషనల్ లోక్ అదాలత్ ద్వారా, చిన్నచిన్న సమస్యల నుండి మొదలుకొని పెద్ద వివాదాల వరకు త్వరగా పరిష్కారం పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ ఉన్నవాళ్లు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి. కాబట్టి ఎవరికైనా ట్రాఫిక్ ఛాలన్లు పెండింగ్‌లో ఉంటే, ఈ లోక్ అదాలత్ అవకాశాన్ని వినియోగించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు తప్పించుకోవచ్చు.