E-Paper
Advertisement

Asaduddin Owaisi | కొత్త క్రిమినల్ చట్టాలతో పౌరుల స్వేచ్ఛకు ముప్పు : ఒవైసీ

Asaduddin Owaisi | కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త క్రిమినల్ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలపై చర్యలు తీసుకునేందుకు ప్రతిపాదిత కొత్త క్రిమినల్ చట్టాలు పోలీసులకు విస్తృత అధికారాలను కల్పిస్తాయని.. ఫలితంగా పౌర స్వేచ్ఛ, పౌర హక్కులకు భంగం కలుగుతుందని ఒవైసీ పేర్కొన్నారు.

ప్రతిపాదిత మూడు క్రిమినల్ చట్టాలతో దేశంలోని దళితులు, ఆదివాసీలు, ముస్లింలకు ముప్పు పొంచిఉందని ఆయన ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లోక్ సభలో కొత్త క్రిమినల్ చట్టాలపై జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

”ఇప్పటికే దేశవ్యాప్తంగా జైళ్లలో మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని జైళ్లలో 33 శాతం మంది ముస్లింలు మగ్గుతున్నారు” అని ఒవైసీ తీవ్ర ఆరోపణలు చేశారు. కొత్త క్రిమినల్ చట్టాలలో చాలా ప్రమాదకరమైన నిబంధనలు ఉన్నాయని.. పోలీసులకే న్యాయనిర్ణేతులుగా మారేందుకు కొత్త చట్టాలు అధికారాలు కల్పిస్తున్నాయని మండిపడ్డారు. దేశ ద్రోహం చట్టాన్ని రద్దు చేస్తున్నామని చెబుతూ.. అదే చట్టాన్ని మరో రూపంలో తీసుకొస్తున్నారని చెప్పారు. పైగా కొత్త దేశ ద్రోహం చట్టం కింద కనీస జైలు శిక్షను మూడేళ్ల నుంచి ఏడేళ్లకు పెంచారని పేర్కొన్నారు.

అత్యాచారం నేరాన్ని లింగ భేదానికి అతీతంగా చేయాలని ఒవైసీ డిమాండ్ చేశారు.

Advertisement

Related News

అక్టోబర్ 1 నుంచి అమల్లోకి.. జనన-మరణాల నమోదుకు కఠినమైన చట్టం, ఆలస్యమైతే

కారు బానెట్‌పై గాళ్‌ఫ్రెండ్‌ని ఈడ్చుకెళ్లిన ప్రియుడు.. లక్నోలో షాకింగ్ ఘటన, వీడియో వైరల్

పాక్ ఉగ్రవాదులకు కేంద్రం బిగ్ షాక్.. షహబాజ్ నెట్‌వర్క్‌ ఉగ్ర సంస్థగా ప్రకటన!

కాంగ్రెస్ నేతల దారుణ హత్య కేసు.. ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు.. 10 మందికి మరణశిక్ష

లాడ్జి బాత్రూంలో యువతి మృతదేహం.. ఇద్దరు యువకులు పరార్, బెంగుళూరు సమీపంలో ఘటన

ఇదేందయ్యా ఇది.. 21 వేల పానీపూరీలతో 13 అడుగుల గణపతి.. వీడియో వైరల్

రోడ్డు దాటుతుండగా దూసుకొచ్చిన కారు.. గాల్లోకి ఎరిగిన వ్యక్తి, హిట్ అండ్ రన్‌లో షాకింగ్ దృశ్యాలు

రైల్వే జాబ్స్.. 7వ పే కమిషన్ జీతంతో 560 ఉద్యోగాలు

Big Stories

Advertisement
×