BigTV English

Ravi Teja: ఆయుధాలతో యుద్ధం చేసేవాడు రాక్షుసుడు .. ఆపేవాడు దేవుడు..ఈగల్ ట్రైలర్ సూపర్..

Ravi Teja: ఆయుధాలతో యుద్ధం చేసేవాడు రాక్షుసుడు .. ఆపేవాడు దేవుడు..ఈగల్ ట్రైలర్ సూపర్..

Ravi Teja: ఇరగదీస్తున్న మాస్ మహారాజ్ ఈగల్ ట్రైలర్..పవర్ఫుల్ పంచ్ డైలాగ్ తో.. దూసుకు వస్తున్న ఈగల్.. జోరు సూపర్..


మాస్ మహారాజ్ రవితేజ..కార్తీక్ ఘట్టమనేనిని కాంబోలో వస్తున్న సరికొత్త చిత్రం ‘ఈగల్’. ఈ మూవీ లో కావ్య తపర్ హీరోయిన్గా నటిస్తుండగా..అనుపమ పరమేశ్వరన్, నవదీప్, వినయ్ రాయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి బరి లో దిగనున్న ఈ చిత్రం ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు చిత్రం బృందం విడుదల చేసిన ట్రైలర్ మంచి మాస్ పవర్ ప్యాకెడ్ యాక్షన్ సీక్వెన్స్లతో అదరగొడుతోంది.

ఈ టీజర్ లో  రవితేజ మాస్ అండ్ క్లాస్ లుక్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు.”ఆయుధాలతో యుద్ధం చేసేవాడు రాక్షుసుడు అవుతాడు. ఆయుధాలతో యుద్ధం ఆపేవాడు దేవుడు అవుతాడు”మూవీ స్టోరీ లైన్ ని మొత్తం చెప్పకనే చెప్పాడు డైరెక్టర్. ఇక ఈ మూవీ విజువల్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ ట్రైలర్ మూవీపై విపరీతమైన హైప్ ని పెంచుతుంది. ఈ చిత్రం జనవరి 13న విడుదల కాబోతోంది.


“నుంచి వచ్చే బుల్లెట్ ఆగేదెప్పుడో తెలుసా.. అది పట్టుకున్న వాడిని తాకినప్పుడు”..“విషం మింగుతాను.. విశ్వం తిరుగుతాను.. ఊపిరి ఆపుతాను.. కాపలా అవుతాను. విధ్వంసం నేను.. విధ్వంసాన్ని ఆపే వినాశనాన్ని నేను” లాంటి పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ రవితేజ మాస్ పర్సనాలిటీకి బాగా సెట్ అయ్యాయి. ఈ ట్రైలర్ నిడివి 1 నిమిషం 56 సెకన్లు ఉంది.“మార్గశిరం.. మధ్యరాత్రి ఓ మొండి మోతుబరి చేసిన మారణహోమం గురించి తెలియాలి” అనే నవదీప్ డైలాగ్ మూవీ స్టోరీ చాలా ఇంటెన్సిటీతో ఉంది అన్న విషయాన్ని కన్వే చేస్తుంది. ఇక ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా సెట్ అయింది.

ట్రైలర్ చాలా ఆకట్టుకోవడమే కాకుండా మూవీ పై మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. ఏ మూవీ కచ్చితంగా సంక్రాంతి బరిలో మంచి పోటీ ఇస్తుంది అని అర్థమవుతుంది. ఇంతకుముందు భారీ హైట్ తో వచ్చిన రవితేజ టైగర్ నాగేశ్వరరావు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది.. ఈ చిత్రమైన మంచి సక్సెస్ సాధిస్తుంది అని మాస్ మహారాజ్ అభిమానులు ఆశిస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×