E-Paper
Advertisement

నితీష్ కుమార్ సంచలన నిర్ణయం.. బీహార్ సీఎం పదవికి రాజీనామా!

నితీష్ కుమార్ సంచలన నిర్ణయం.. బీహార్ సీఎం పదవికి రాజీనామా!
Advertisement

Nitish Kumar: బీహార్ రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. సుదీర్ఘకాలం పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందించిన నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న మాటలు కేవలం ఒక వీడ్కోలు ప్రసంగంలా కాకుండా.. గత రెండు దశాబ్దాల అభివృద్ధి ప్రస్థానానికి అద్ధం పట్టేలా ఉన్నాయి.

నవంబర్ 24,2005న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి బీహార్‌లో ఒక కొత్త అధ్యాయం మెుదలైందని ఆయన గుర్తుచేశారు. గడిచిన 20 ఏళ్లలో రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన నెలకొల్పడమే తమ ప్రథమ ప్రాధాన్యమని, కులమతాలకు అతీతంగా సమాజంలోని అన్నీ వర్గాల కోసం, ముఖ్యంగా దళితులు, మహాదళితులు, మహిళలు, వెనుకబడిన వర్గాల కోసం తమ ప్రభువ్వం అంకితభావంతో పనిచేసిందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

పాలనా పరంగా బీహార్ సాధించిన మార్పులను ఆయన వివరిస్తూ.. విద్య, ఆరోగ్యం, రోడ్లు, విద్యుత్, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో జరిగిన విప్లవాత్మక మార్పులను ప్రస్తావించారు. కేవలం గతాన్ని నెమరువేసుకోవడమే కాకుండా, భవిష్యత్తు కోసం 7నిశ్చయ్-3 ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ విజన్ ద్యారా రాబోయే ఐదేళ్లలో బీహార్ దేశంలోని అగ్రగామి రాష్ట్రాల సరసన నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ప్రయాణంలో కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న మద్దతును ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. ‘నేను ముఖ్యమంత్రిగా బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. గవర్నర్‌ను కలిసి నా రాజీనామా సమర్పించాను’,అని చెబుతూనే .. కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి తన పూర్తి మద్దతు, మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ ఉంటాయాని స్పష్టం చేశారు.

Advertisement

రాష్ట్ర ప్రజల పట్ల తనకున్న కృతజ్ఞితను చాటుకుంటూ, బీహార్ ప్రగతి పథంలో మరింత వేగంగా దూసుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన తన ప్రసంగాన్నిముంగంచారు. ఇది ఒక నాయుకుడి నిష్క్రమణ మాత్రమే కాదు.. బీహార్ భవిష్యత్తు కోసం ఆయన వేసిన బలమైన పునాది నిదర్శనం.

Related News

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి.. బంగారం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు, స్వదేశీ మంత్రంతోపాటు

Big Stories

Advertisement
×