BigTV English

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ ఇచ్చిన హైకోర్టు.. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేం..

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ ఇచ్చిన హైకోర్టు.. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేం..

Arvind KejriwalArvind Kejriwal On Liquor Policy Case: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ కు షాక్ ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో తనని అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. అయితే ఈ కేసులో తనని అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రస్తుతం కేసు పురోగతి దృష్ట్యా తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.


ఢిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణ నిమిత్తం శుక్రవారం విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని కేజ్రీవాల్ కు ఈడీ గతంలో సమన్లు జారీ చేసింది. అయితే ఈ కేసులో భాగంగా తనని తప్పనిసరిగా ఈడీ అధికారుల అరెస్ట్ చేస్తారని భావించి.. గురువారం ఉదయం హూటాహుటిని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఈడీ విచారణకు సిద్ధంగా ఉన్నానని, ఈడీ తనని అరెస్ట్ చేయకుండా, ఎటువంటి చర్యలకు పాల్పడకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు.

Also Read: Electoral Bonds: ఈసీకి ఎలక్టోరల్ బాండ్ల నంబర్లను అందించిన SBI


కేజ్రీవాల్ పిటిషన్ ను విచారించిన ధర్మాసనంకు ఇరువురు వాదనలు వినిపించారు. వీటిని విన్న ధర్మాసనం కేజ్రీవాల్ కు అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వడానికి నిరాకరించింది. కేజ్రీవాల్ అభ్యర్థనపై ఈడీ వివరణ కోరింది. అనంతరం ఈ కేసు విచారణను వాయిదా వేసింది. సమాన్లను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ తో పాటుగా దీన్ని కూడా ఏప్రిల్ 22న విచారిస్తామని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.

ఇప్పటి వరకు లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు తొమ్మిది సార్లు సమన్లు జారీ చేశాయి. అయినా సరే కేజ్రీవాల్ ఒక్కసారి కూడా ఈడీ విచారణకు హాజరుకాలేదు. దీంతో తమ సమన్లు కేజ్రీవాల్ ఉల్లంఘించారంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే కేజ్రీవాల్ ఈ కేసులో బెయిల్ దక్కించుకున్నారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×