E-Paper
Advertisement

Odisha Tobacco Ban: రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు ఉత్పత్తులపై నిషేధం.. ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం

Odisha Tobacco Ban: రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు ఉత్పత్తులపై నిషేధం.. ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం
Advertisement

Odisha Tobacco Ban: ఒడిశా ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్యాన్ని కాపాడటానికి పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించింది. నికోటిన్‌ కలిగి ఉండే గుట్కా, పాన్‌ మసాలా, జర్దా, ఖైనీ వంటి ఉత్పత్తుల తయారీ, విక్రయం, నిల్వ, రవాణాపై రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా నిషేధం విధించింది. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసింది. పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని, పొగాకు రహిత రాష్ట్రంగా ఒడిశాను తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరింది.

సుప్రీంకోర్టు ఆదేశాలకు

సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, పొగాకు వాడకం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలు పెరుగుతుండడంతో ఒడిశా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒడిశా కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. పొగాకు లేదా నికోటిన్ కలిగిన అన్ని ఉత్పత్తులు, ప్యాక్ చేసిన లేదా ప్యాక్ చేయని పొగాకు ఉత్పత్తులను నిషేధించింది.

Advertisement

“పాన్ మసాలా, తమలపాకు, అరెకా గింజ, స్లాక్డ్ లైమ్, ఇతర ప్రాసెస్డ్, రుచిగల, మసాలా దినుసులు వంటి ఆహార పదార్థాలతో పాటు పొగాకును విస్తృతంగా ఉపయోగించడం ప్రజారోగ్యానికి హానికరం. ముఖ్యంగా పిల్లలు, యువకుల ఆరోగ్యానికి ప్రాణాంతకం” అని నోటిఫికేషన్ లో ఒడిశా ప్రభుత్వం పేర్కొంది. పొగాకు నవలడం వల్ల క్యాన్సర్ వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. పొగాకు కారణంగా.. నోరు, అన్నవాహిక, కడుపు, ప్యాంక్రియాటిక్, గొంతు, మూత్రపిండాల క్యాన్సర్‌ల వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

Also Read:  రూ.12 కోట్లు.. 400 రత్నాలు.. వంతారా థీమ్‌తో అనంత్ అంబానీ కోసం అరుదైన వాచ్!

ఒడిశాలో 42 శాతం

Advertisement

ఒడిశా జనాభాలో 42% మంది పొగాకు ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. ఇది జాతీయ సగటు కంటే దాదాపు రెట్టింపు అని సర్వేలు చెబుతున్నాయి. 2016 సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఒడిశా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొంతమంది వ్యాపారులు పొగాకుతో కలిపిన పాన్ మసాలాను ప్రత్యేక ప్యాకేజీలలో అమ్ముతూ.. గుట్కా నిషేధాన్ని ఉల్లంఘిస్తున్నారు. దీంతో సుప్రీంకోర్టు ఈ ఉత్పత్తులపై నిషేధం విధించింది. పొగాకు లేదా నికోటిన్‌తో గుట్కా, పాన్ మసాలా తయారీ, అమ్మకాలపై విధించిన నిషేధాన్ని పూర్తిగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది.

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×