E-Paper
Advertisement

Wife Tied Husband: భర్తను మంచానికి కట్టేసిన భార్య.. ఆ వెంటనే అత్త చేసిన పనికి అంతా షాక్

Wife Tied Husband: భర్తను మంచానికి కట్టేసిన భార్య.. ఆ వెంటనే అత్త చేసిన పనికి అంతా షాక్
Advertisement

Wife Tied Husband: ఉత్తరప్రదేశ్‌ లోని అలీఘర్‌లో ఒక మహిళ తన భర్త తాగి వస్తున్నాడని కోపంతో.. అతనిని మంచానికి కట్టేసింది. తన కొడుకును కోడలు మంచానికి కట్టేసిందన్న కోపంతో అత్త.. తన కోడలు నాటు తుపాకీతో ఉన్న ఫొటోతో పోలీస్ స్టేషన్ వెళ్లింది. కోడలిపై ఫిర్యాదు చేసింది. భర్తను మంచానికి కట్టేసి ఉన్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతుంది. ఈ సంఘటన అలీఘర్‌లోని హమీద్‌పూర్ గ్రామంలో జరిగినట్లు సమాచారం.

పోలీసులు ఏమన్నారంటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళ తన భర్త మద్యం తాగుతున్నాడని, అతనిని మంచానికి కట్టేసి దాడి చేసిందని ఫిర్యాదు అందింది. వైరల్ అయిన వీడియోలో, ఓ వ్యక్తిని మంచానికి కట్టేశారు. అతని భార్య పక్కన గొడవ చేస్తున్నట్లు వినిపిస్తుంది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఆ వ్యక్తి తల్లి, గ్రామస్తులు.. అతడికి ఇంటికి చేరుకుని మంచం నుంచి విడిపించారు. తన కోడలి వద్ద నాటు తుపాకీ ఉందని, దానితో తన కొడుకును బెదిరిస్తుందని అత్త ఆరోపిస్తుంది. తన కోడలు పిస్టల్ పట్టుకున్న ఫొటోను పోలీసులు అందించింది.

Advertisement

“నా కొడుకు ప్రదీప్. నా కోడలు ప్రదీప్ ను కొడుతుంది. ఆమె దగ్గర పిస్టల్ ఉంది, చంపేస్తానని బెదిరిస్తుంది. నేను ఇంట్లో పిస్టల్ కోసం వెతికాను, కానీ దొరకలేదు. కోడలు రసూల్‌పూర్ నివాసి, ఆమె పేరు సోని. నా కొడుకుతో పెళ్లై నాలుగు సంవత్సరాలు అయింది. గత రెండు సంవత్సరాలుగా కోడలు మమ్మల్ని వేధిస్తోంది. మేము పోలీసులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు కూడా ఫిర్యాదు చేశాము. ఇప్పుడు తప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం” అని బాధితుడి తల్లి తెలిపింది.

తుపాకీతో బెదిరింపులు

Advertisement

గతంలో తమ కోడలిపై పోలీసులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధిత వ్యక్తి తల్లి చెబుతోంది. గత రెండు సంవత్సరాలుగా వేధింపులు, తుపాకీతో పదే పదే బెదిరింపులు వస్తున్నాయని ఆమె ఆరోపిస్తుంది. పోలీసులు ఫిర్యాదును స్వీకరించారని, వైరల్ వీడియో, కుటుంబ సభ్యుల ఆరోపణలను పరిశీలిస్తున్నారని పేర్కొంది.

Also Read:  టిప్ ఇస్తేనే డోర్స్ ఓపెన్ చేస్తా.. లండన్‌లో ఉబెర్ డ్రైవర్ ఓవరాక్షన్, కారులోనే పడుకో అని.!

“ప్రదీప్ తరచుగా ఇంటి విషయాలపై తన భార్యతో గొడవ పడుతున్నాడు. మద్యం మత్తులో ఇంట్లోనే కాకుండా పొరుగువారితో కూడా తరచుగా గొడవ పడుతున్నాడు. ఈ పరిస్థితుల కారణంగా, భార్య తన భర్తను మంచానికి కట్టేసింది. వైరల్ వీడియోను గమనించిన తప్పల్ పోలీస్ సిబ్బంది ప్రదీప్ భార్యను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారణ ప్రారంభించాం” అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

 

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×