E-Paper
Advertisement

Bellamkonda Suresh: బెల్లంకొండ కబ్జా కేసు.. ఇంకే సినిమాకు రూపాయి కూడా ఇచ్చేది లేదు

Bellamkonda Suresh: బెల్లంకొండ కబ్జా కేసు.. ఇంకే సినిమాకు రూపాయి కూడా ఇచ్చేది లేదు
Advertisement

Bellamkonda Suresh: నిర్మాత బెల్లంకొండ సురేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలను నిర్మించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇప్పటికీ అడపాదడపా తన బ్యానర్ లో  సినిమాలు చేస్తున్నా కూడా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాడు. ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ వారసులు.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బెల్లంకొండ గణేష్ హీరోలుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుతున్నారు.

ఇక ఇదంతా పక్కన పెడితే ఈ మధ్యనే బెల్లంకొండ సురేష్ ఒక కబ్జా కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఆయనపై ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు అయింది. తన ఇల్లు కబ్జా చేశాడు అంటూ శివ ప్రసాద్ అనే వ్యక్తి  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఫిల్మ్  నగర్ రోడ్ నెంబర్ 7 లో తాళం వేసి ఉన్న తన ఇల్లును సురేష్ కబ్జా చేశాడని శివప్రసాద్ ఫిర్యాదులో తెలిపాడు. గత కొద్దికాలంగా తమ ఇంటికి తాళం వేసి ఉంచామని, మొన్న సురేష్.. ఆయన మనుషులు వచ్చి ఆ తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న సామాన్లను అన్ని విసిరికొట్టి, గోడలను ధ్వంసం చేసి ఇల్లు మొత్తాన్ని చిందరవందరుగా చేశాడని.. అడిగేందుకు వెళ్లిన తన సిబ్బందిపై దుర్భషలాడి పంపించాడని శివప్రసాద్ ఫిర్యాదులో తెలిపాడు.

Advertisement

ప్రస్తుతం ఈ కేస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక నిర్మాత  ఇలాంటి పనులు చేయడంపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే  సురేష్ కి ఇదేమీ కొత్త కాదని, గతంలో చాలాసార్లు ఆయన ఈలాంటి పనులు చేశాడని చెప్పుకొస్తున్నారు. ఇక దీంతో టాలీవుడ్ ఫైనాన్షియర్లు బెల్లంకొండ సురేష్ విషయంలో  కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి బెల్లంకొండ సురేష్ సినిమాలకు ఒక్క రూపాయి కూడా  ఫైనాన్స్ ఇచ్చేది లేదని ఖరాఖండీగా తేల్చి చెప్పనున్నట్లు సమాచారం. త్వరలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేయనున్నారని తెలుస్తుంది.

ఇదే కనుక జరిగితే సురేష్ కెరీర్ కు అడ్డుకట్ట పడినట్లే అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఇద్దరు కొడుకులను ఒకసారి కాకపోతే ఒకసారి అయినా ఆయన బ్యానర్ లోని సినిమాలు చేయిస్తూ ఇండస్ట్రీలో నిలబెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఫైనాన్షియర్లు తీసుకున్న నిర్ణయంతో అది ఇక ముందు జరగదు అని కచ్చితంగా చెప్పొచ్చు. మరి ఈ కేస్ పై బెల్లంకొండ సురేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది చూడాలి.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×