IndiGo Flight Passenger: ఇండిగో విమానంలో తోటి ప్రయాణికుడు కొట్టిన తర్వాత అదృశ్యమయ్యాడు అస్సాంకి చెందిన యువకుడు హుస్సేన్ అహ్మద్ మజుమ్దార్. చివరకు బర్పేటా రైల్వేస్టేషన్‌లో కనిపించడంతో అతడి బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..
శనివారం ముంబై-కోల్‌కతా ఇండిగో విమానం వెళ్లింది. అయితే విమానం లోపల ఓ ప్రయాణికుడ్ని మరో ట్రావెల్ చెంప ఛెళ్లుమనిపించాడు. లోపల ఏం జరిగిందనేది కాసేపు పక్కన పెడదాం. ఆ ప్రయాణికులు నేరుగా అస్సాం వెళ్లాల్సి ఉండగా కోల్‌కతాలో దిగిన తర్వాత కనిపించడం మానేశాడు. దీంతో ఆ యువకుడి బంధులు కంగారుపడ్డారు.
ముంబైలో ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు 32 ఏళ్ల యువకుడు హుస్సేన్ అహ్మద్ మజుమ్దార్ హుస్సేన్. కేన్సర్‌తో బాధపడుతున్న తండ్రిని చూసేందుకు శనివారం ముంబై నుంచి సిల్చార్‌కు కనెక్టింగ్ ఫ్లైట్‌లో బయలుదేరాడు. అయితే ఇండిగో విమానం కోల్‌కతా వరకు మాత్రమే ఉంది. అక్కడి నుంచి మరో ఫైట్ మీద వెళ్లాల్సి ఉంది.
అస్సాం ఎయిర్‌పోర్టులో కుటుంబసభ్యులు అహ్మద్ కోసం ఎదురు చూశారు. కనిపించకపోవడంతో కంగారు పడ్డారు. అదే సమయంలో హుస్సేన్‌కు ఫోన్ చేశారు. లిప్ట్ చేయకపోవడంతో అసలు టెన్షన్ మొదలైంది. అయితే కోల్‌కతా ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే అహ్మద్ అక్కడి నుంచి అస్సాంకు రైలులో వెళ్లాడు.
ALSO READ: ఫాస్టాగ్ ఏడాది పాస్.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
అక్కడి నుంచి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు హుస్సేన్ బర్పేటా రైల్వే స్టేషన్‌లో ఉన్నట్టు సమాచారం రావడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. హుస్సేస్ గురించి కటిగోరా పోలీసులు నోరు విప్పారు. హుస్సేన్ కోల్‌కతాలో రైలు ఎక్కి నేరుగా బర్పేటాకు చేరుకున్నాడని తెలిపారు. సిల్చార్‌కు వెళ్లాడని, నీరసంగా కనిపించడంతో ఆహారం అందించామని తెలిపారు.
చివరకు అదృశ్యమైన హుస్సేన్ కనిపించడంతో కుటుంబసభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు. హుస్సేస్ ఫోన్ ముంబైలో పోయింది. విమానం ఎక్కేటప్పుడు టికెట్లు చూపించాడు. ఇంతకీ హుస్సేన్ చెంప దెబ్బ ఎందుకు తిన్నాడు? అనేది ఆసక్తికరంగా మారింది. విమానం టేకాఫ్ సమయంలో హుస్సేన్‌కు గుండె దడ దడ కొట్టుకుంది. దీంతో భయపడ్డాడు.
విమానం నుంచి దిగిపోవాలని ప్రయత్నించాడు. ఏడుస్తూ విమానం నుంచి దిగిపోవాలని డిసైడ్ అయ్యాడు. ఈలోగా క్యాబిన్ సిబ్బంది ఆయన్ని కూల్ చేసేందుకు సీటు వద్దకు తీసుకెళ్తున్నాడు. ఈలోగా మరో ప్రయాణికుడు రహ్మాన్ తన సీటు నుంచి హఠాత్తుగా లేచి హుస్సేన్‌ను చెంపదెబ్బ కొట్టాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయ్యింది.
Video has been circulating showing a man slapping a Muslim passenger on an Indigo flight.
Congress Left-wing groups and Islamists were quick to blame Hindus for the incident. But the truth is finally out – the man who slapped the passenger is also a Muslim. #IndigoFlight #Indigo pic.twitter.com/4aw3hEeoZl
— TIger NS (@TIgerNS3) August 1, 2025