BigTV English

Prostitution Case: వ్యభిచారం కేసులో విటులు కూడా నేరం చేసినట్టే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Prostitution Case: వ్యభిచారం కేసులో విటులు కూడా నేరం చేసినట్టే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

వ్యభిచారం చేస్తూ పట్టుబడితే మగ, ఆడ అనే తేడా లేకుండా ఇద్దరిపై విచారణ జరుగుతుంది. అయితే సహజంగా విటులు పోలీస్ స్టేషన్లో మేనేజ్ చేసుకుని బయటపడుతుంటారు. అయితే తిరువనంతపురంలో జరిగిన ఓ సంఘటనలో సదరు విటుడు పోలీసులకు క్లాస్ తీసుకున్నాడు. అక్కడ వ్యభిచారం జరుగుతోందని, కానీ తాను కస్టమర్ ని అంటూ అతి తెలివి ప్రదర్శించాడు. కోర్టులో కూడా అదే వాదన వినిపించాడు. తాను కేవలం కస్టమర్ ని అని, అందువల్ల తన తప్పు లేదని అన్నాడు. ఈ కేసు విచారణ సందర్భంగా కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యభిచారం చేస్తూ పట్టుబడిన విటుడు తాను కస్టమర్ ని అని చెప్పడం సరికాదన్నది. వ్యభిచారానికి ప్రేరేపించిన కారణంగా అతడిపై కేసు నమోదు చేయవచ్చని, విచారణ కొనసాగించవచ్చునని స్పష్టం చేసింది.


కస్టమర్ అంటే ఎవరు..?
వస్తువుల కొనుగోలు, అమ్మకం విషయంలో షాప్ ఓనర్, కస్టమర్ అనే రిలేషన్ ఉంటుంది. కానీ వ్యభిచారం చేస్తూ పట్టుబడిన వ్యక్తి తనను తాను కస్టమర్ ని అని చెప్పుకోవడం ఇక్కడ విశేషం. మహిళలు వస్తువులు కాదని, అందువల్ల కస్టమర్ అనే పదం వాడటానికి వీలు లేదన్నది కేరళ హైకోర్టు. వ్యభిచార గృహంలో సెక్స్ వర్కర్ సేవలను పొందే వ్యక్తిపై ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్(ITPA), 1956 సెక్షన్ 5(1)(d) కింద కేసు నమోదు చేయవచ్చని తీర్పు చెప్పింది. వ్యభిచారాన్ని ప్రేరేపించడం కూడా నేరమేనని తెలిపింది. జస్టిస్ VG అరుణ్ ఈ తీర్పును వెలువరించారు.

ITPA సెక్షన్లు ఇవే..
ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1956లోని సెక్షన్ 3 ప్రకారం వ్యభిచార గృహం నిర్వహించడం నేరం, సెక్షన్ 4 ప్రకారం వ్యభిచారం ద్వారా వచ్చే ఆదాయంపై జీవించడం కూడా నేరం, సెక్షన్ 5(1)(డి), సెక్షన్ 7 ప్రకారం జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లో, లేదా నివాసిత ప్రాంతాల సమీపంలో వ్యభిచారం నేరం. అయితే భారత్ లో వ్యభిచారం నేరమా, కాదా, ఒకవేళ నేరమైతే అందులో బాధితులు ఎవరు, నిందితులెవరు అనే అంశాలపై వేర్వేరు సందర్భాల్లో కోర్టులు వేర్వేరుగా తీర్పులివ్వడం విశేషం. ఈ విషయంలో 2018 సెప్టెంబర్ 27న సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. వ్యభిచారం కేసుల్లో వివాహిత అయిన స్త్రీతో పట్టుబడిన ఒక వివాహిత పురుషుడు కచ్చితంగా ఆరోపణలు ఎదుర్కోవాల్సిందే. ఈ కేసులో సదరు వివాహిత స్త్రీని బాధితురాలిగా పరిగణించి విడిచిపెడతారు. అయితే ఈ సందర్భంలో పట్టుబడిన వివాహిత భర్త కేసు పెడితేనే.. నిందితుడిపై విచారణ మొదలవుతుంది. అయితే ఒక వివాహిత పురుషుడు, అవివాహితురాలితో కలసి ఉంటే వారిపై కేసు నమోదు చేయడం కుదరదు. ఇక్కడ సదరు అవివాహితురాలు కేసు పెడితేనే పోలీసులు విచారణ చేపట్టాల్సి వస్తుంది.


ఆ లొసుగుల ఆధారంగా..
చట్టంలో ఉన్న లొసుగుల్ని అడ్డు పెట్టుకుని వ్యభిచార కేంద్రాలు ఇంకా నడుస్తున్నాయి. అయితే అసలు విటులు అనేవారు లేకపోతే వీటితో అవసరం ఉండదు కదా అనేది కేరళ హైకోర్టు వాదన. అందుకే వ్యభిచారాన్ని ప్రేరేపిస్తున్నారనే కేసులు విటులపై పెట్టవచ్చు అని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. వ్యభిచారం ఇంకా సమాజంలో కొనసాగడానికి విటులే కారణం అని తేల్చి చెప్పింది.

Related News

Kerala Court Judgment: తల్లికి భరణం చెల్లించని వ్యక్తికి జైలు శిక్ష

Malaria vaccine: మలేరియాకు మందు.. భారత తొలి వ్యాక్సిన్‌కు హైదరాబాద్ నుంచే శ్రీకారం

Milk Prices: శుభవార్త.. తగ్గనున్న పాల ధరలు.. లీటర్‌కు ఎంత తగ్గిస్తారంటే

Indian Constitution: పొరుగు దేశాలు చూశారా ఎలా ఉన్నాయో.. నేపాల్, బంగ్లాదేశ్‌లపై.. భారత సుప్రీం కోర్డు కీలక వ్యాఖ్యలు

Samruddhi Mahamarg: వంతెన మీద మేకులు.. వందలాది వాహనాలు పంక్చర్.. ఈ కుట్రకు కారకులెవరు?

Big Stories

×