Asia Cup 2025 : ఆసియా కప్2025 లో భాగంగా భారత్ వర్సెస్ యూఏఈ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా టీమిండియా టీ-20 మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్ కి దూరం కావడంతో దుబాయ్ వేదికగా యూఏఈ వర్సెస్ టీమిండియా మధ్య జరిగిన మ్యాచ్ లో రోహిత్, విరాట్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. వారిద్దరి ఫొటోలను చూపిస్తూ we miss you అంటూ ప్లకార్డు ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ ప్లకార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆసియా కప్ 2025 ఆడాల్సింది అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : PKL 2025 : ప్రో కబడ్డీ లో భయంకరంగా మారుతున్న తెలుగు టైటాన్స్.. వరుసగా 3 విజయాలతో
వాస్తవానికి 2024 టీ-20 వరల్డ్ కప్ తరువాత టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు వీరిద్దరూ టెస్ట్ క్రికెట్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ వాస్తవానికి కోహ్లీ టెస్ట్ క్రికెట్ ఆడాల్సింది అని కొందరూ అభిమానులు పేర్కొంటున్నారు. రోహిత్ శర్మ ప్రస్తుతం టీమిండియా వన్డే కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. దీంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కేవలం వన్డే ఆటగాళ్లుగా మాత్రమే కొనసాగనున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ తరువాత వీరిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించనున్నట్టు సమాచారం. 2026 టీ-20 వరకు ఉంటే బాగుండేదని తమ అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక టీమిండియా వర్సెస్ యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు 13.1 ఓవర్లలో 57 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 4.3 ఓవర్లలోనే 1 వికెట్ కోల్పోయి ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో భారత్ 9 వికెట్ల తేడాతో యూఏఈని చిత్తు చేసింది. యూఏఈ బ్యాటర్లలో ఓపెనర్ అలీషాన్ 17 బంతుల్లో 22 పరుగులు చేయగా.. వసీమ్ 22 బంతుల్లో 19 పరుగులు చేకుల్శడు. వీరిద్దరూ మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. 58 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అభిషేక్ శర్మ తొలి బంతికే సిక్స్ బాదాడు. ఆ తరువాత 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు. శుబ్ మన్ గిల్ 9 బంతుల్లో 20 నాటౌట్. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 2 బంతుల్లో 7 నాటౌట్ గా నిలిచాడు. కుల్దీప్ యాదవ్ 2.1 ఓవర్లు బౌలింగ్ చేసి 4 వికెట్లు తీయడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మరోవైపు శివమ్ దూబె కూడా 3 వికెట్లు తీశాడు. తొలుత బుమ్రా వికెట్ల వేట ప్రారంభించగా.. ఆ తరువాత వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, దూబె యూఏఈ బ్యాటర్లను క్రీజులో లేకుండా చేశారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ తన తొలి ఓవర్ లోనే 3 వికెట్లు తీసుకోవడం విశేషం.
Indian fans missing Rohit Sharma & Virat Kohli in Asia Cup. ❤️ pic.twitter.com/z7AAQholpe
— Johns. (@CricCrazyJohns) September 10, 2025