E-Paper
Advertisement

పెట్రోల్-డీజిల్ ధరల పెంపుపై సంకేతాలు, లీటర్‌కు 4 లేదా 5 రూపాయలు పెరిగే ఛాన్స్

పెట్రోల్-డీజిల్ ధరల పెంపుపై సంకేతాలు, లీటర్‌కు 4 లేదా 5 రూపాయలు పెరిగే ఛాన్స్
Advertisement

Fuel prices Hike!: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. దీని ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మహా అయితే లీటర్‌కు 4 నుంచి 5 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

పెట్రోల్-డీజిల్ ధరల పెంపుపై సంకేతాలు

Advertisement

పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధనాలను జాగ్రత్తగా వాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. సిటీల్లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, మెట్రో రైళ్లు వినియోగించాలని సూచించారు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఏ క్షణంలోనైనా పెరగవచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ విషయంపై సంబంధిత మంత్రిత్వ శాఖల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.

సరైన సమయంలో ఆయిల్ ధరలు పెంపుపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం అన్ని మార్గాలను పరిశీలిస్తోందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. పెరుగుతున్న నష్టాలను పూడ్చుకోవడానికి ఆయిల్ కంపెనీలు.. రాబోయే రోజుల్లో పెట్రోల్-డీజిల్ ధరలను పెంచే అవకాశం ఉందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి.

Advertisement

లీటర్‌కు 4 లేదా 5 రూపాయలు పెరిగే ఛాన్స్

ఇంధన ధరల పెంపుపై ఆర్థిక-పెట్రోలియం మంత్రిత్వ శాఖ-ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మధ్య ప్రతి రోజూ చర్చలు జరుగుతున్నాయి. ఈ పెంపు ప్రపంచ ముడి చమురు పోకడలు, ద్రవ్యపరమైన ఒత్తిళ్లు, ఇంధన ధరలను సమతుల్యం చేసే విధానంపై ఆధారపడి ఉంటుందని ఆ వర్గాలు చెబుతున్నాయి.

గత 10 వారాల్లో లక్ష కోట్లకు పైగా నష్టాలను చవి చూసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందన తర్వాత ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 104 డాలర్ల మార్కును దాటింది. దాని ప్రభావం దేశంలో ఇంధన ధరల పెరుగుదలకు దారితీయవచ్చని తెలిపాయి.

ALSO READ: గౌహతికి చేరుకున్న సీఎం చంద్రబాబు టీమ్, ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం 

గ్యాస్ సిలిండర్‌పై రూ. 40 నుంచి 50 వరకు పెంచాలని చమురు సంస్థలు భావిస్తున్నాయి. ఈనెల 15వ లోపు ఈ పెంపుపై అధికారిక ప్రకటన రానుంది. చమురు ధరల పెంపు భారాన్ని ప్రజలపై వేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు జోరందుకున్నాయి. ఒకేసారి కాకుండా దశలవారీగా పెంపు అమలు చేయాలని భావిస్తోందట.

పెద్ద మొత్తంలో ధరలు పెంచితే ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తొలుత రూ. 4-5 పెంచాలని భావిస్తున్నారట. ఆ తర్వాత క్రమంగా పెంచుకుంటూ వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. దీని ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై ప్పడుతుంది. పెరుగుతున్న చమురు ధరలకు తోడు డాలర్‌తో రూపాయి విలువ పడిపోవడం మరొక కారణంగా చెబుతున్నారు.

Related News

శ్రీవారి దర్శనం తర్వాత బెంగళూరు వెళ్తుండగా.. డివైడర్‌ను ఢీ కొట్టిన కారు, నలుగురు మృతి

విపక్షానికి స్ట్రాంగ్ కౌంటర్.. డబుల్ మీనింగ్స్ వద్దు, చట్టం ఊరుకోదని హెచ్చరించిన సీఎం విజయ్

ఢిల్లీ పీజీ హాస్టల్ భవనం ఘటన.. పెరుగుతున్న మృతులు, సీసీటీవీలో కీలక విషయాలు, శిథిలాల కింద ఇంకా

చెంప దెబ్బ కొట్టినందుకు.. యువతి గొంతులో కత్తులు దింపాడు యువకుడు, గురుగ్రామ్‌లో ఘటన

ఢిల్లీలో భారీ వర్షాలు.. కూలిన మూడంతస్తుల భవనం

మురికి నదిని ఒంటరిగా శుభ్రం చేసిన పేద యువకుడు.. కట్ చేస్తే అంతర్జాతీయ కంపెనీ జాబ్ ఆఫర్

నిందితుడ్ని వాహనానికి కట్టేసి.. 10 నిమిషాలపాటు లాఠీకి పని చెప్పిన పోలీసులు.. ఆ నేరానికి ఇది చాలా చిన్న శిక్ష!

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. ఆరు రాష్ట్రాలకు ఏఐసీసీ కొత్త నేతలు, ఏపీకి పివి మోహన్‌

Big Stories

Advertisement
×