Delhi Rains: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గురువారం భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో పలు ప్రాంతాలకు నారింజ, పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు ఢిల్లీ-ఎన్‌సిఆర్ అంతటా జన జీవనం స్తంభించింది.
నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్, ఫరీదాబాద్‌లలో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఢిల్లీలోని యమునా నది నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 207.39 మీటర్లకు నీరు చేరుకుంది. పుష్కరకాలం కిందట అంటే 2013లో 207.32 మీటర్ల మార్క్‌ని అధిగమించింది.
ఢిల్లీ సిటీ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన మూడవ అత్యధిక వర్షపాతంగా నమోదు అయ్యింది. ఇదిలాఉండగా గురువారం ఉదయం ఢిల్లీలో జాతీయ రహదారి-44 లోని అలీపూర్ సమీపంలోని ఫ్లైఓవర్‌లో ఓ భాగం కూలిపోయింది. ఆ సమయంలో ఆటో వెళ్తుండగా భారీ హోల్ పడింది. ఈ ఘటనలో ఆటో ముందు పార్టు డ్యామేజ్ కాగా, డ్రైవర్ కు స్వల్పంగా గాయాలయయాయి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఆటోడ్రైవర్‌ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఫ్లైఓవర్‌పై వాహనాలను నిలిపివేశారు. ఫ్లైఓవర్ మీదుగా వెళ్లే ట్రాఫిక్‌ను మళ్లించారు. ఈ ఘటన ఉదయం ఎనిమిది గంటల సమయంలో జరిగిందని అంటున్నారు.
ALSO READ: అదిరిపోయే స్కీమ్.. ఇంటర్ పాసైతే చాలు, ఏడాదికి రూ.20 వేలు
ఫ్లైఓవర్ పై రోడ్డు అకస్మాత్తుగా గుంతలు పడి నాలుగు నుంచి ఐదు అడుగుల లోతున గొయ్యి ఏర్పడింది. గుంత చుట్టూ పగుళ్లు కనిపిస్తున్నాయి. ఫ్లైఓవర్ భూమి నుండి 25 నుండి 30 అడుగుల ఎత్తులో ఉంది. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
ఇదిలావుండగా ఢిల్లీలో కీలక ప్రాంతాల్లోని ఫ్లైఓవర్లపై తనిఖీలు చేపట్టారు అధికారులు. డ్యామేజ్ అయిన ఫ్లైఓవర్లపై ఇంజనీర్లు విభాగంతో ఆడిట్ నిర్వహించాలని భావిస్తోంది. మరోవైపు సీఎం రేఖాగుప్తా పలు ప్రాంతాలను సందర్శించారు. అక్కడి బాధితులకు భరోసా ఇచ్చారు. నివాసితులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం యమునా నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఓల్డ్ రైల్వే బ్రిడ్జి పై రాకపోకలను నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. షెల్టర్‌ల వద్ద సివిల్ డిఫెన్స్ సిబ్బందిని ఢిల్లీ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. షెల్టర్లలో ఉండే వరద బాధితులకు సివిల్ డిఫెన్స్ సిబ్బంది దగ్గరుండి సహాయ సహకారాలు అందిస్తారు.
#WATCH | Delhi | A portion of the flyover on National Highway 44 under the Alipur police station area caved in following heavy rains. pic.twitter.com/za3L1jKwdG
— ANI (@ANI) September 4, 2025
VIDEO | Delhi Rains: Heavy traffic witnessed at Kashmere Gate due to waterlogging.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/iPLHQNblYH
— Press Trust of India (@PTI_News) September 4, 2025